నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న శివరాత్రి పండుగ రోజు చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోయిన తరువాత బెంగళూరు నుంచి తొలుత హైదరాబాద్ నగర శివారులలో మోకిలాలో ఉన్నటువంటి సొంత ఇంటికి తారకరత్న భౌతిక దేహాన్ని తరలించారు. తారకరత్న నివాసంలో చాలా మంది నందమూరి కుటుంబ సభ్యులు కనిపించారు. కానీ తన సొంత తల్లిదండ్రులు మాత్ర అక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఈ విషయంలో చాలా మంది మదిలో ఓ ప్రశ్న ఎదురవుతుంది.
Advertisement
సొంత కొడుకు నివాసానికి రాకుండా ఫిలిం ఛాంబర్ కి తారకరత్న తల్లిదండ్రులు రావడానికి కారణం ఏంటి..? అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది నందమూరి అభిమానులయితే.. వాళ్లు తారకరత్న ఇంటికి వచ్చారు అని అంటుంటే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం తారకరత్న తల్లిదండ్రులు కొడుకు సొంత ఇంటికి రాలేదని.. ఫిలిం ఛాంబర్ కే నేరుగా చూడటానికి వచ్చారని పేర్కొంటున్నారు. ఇక ఈ విషయంలో తారకరత్న తల్లిదండ్రులను చాలా మంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా సొంత కొడుకు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి ఇంత సమయం పడుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Also Read : 1990లో వచ్చిన ఆ రెండు సినిమాల్లో ఒక చిత్రం ఇండస్ట్రీ హిట్ అనడంతో వివాదం..!
తారకరత్నని చివరి చూపు చూడటానికి తల్లిదండ్రులు తారకరత్న సొంత ఇంటికి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం తారకరత్న ఉంటుంన్న ఇల్లు అలేఖ్య రెడ్డిది. కోడలుతో అత్త, మామలకు ఉన్న విభేదాల కారణంగానే.. వాళ్లు కోడలు ఇంటి గడప తొక్కడానికి ఇష్టపడక చివరికీ కొడుకు చనిపోయినా ఆ ఇంటికి వెళ్లలేదని తెలుస్తోంది. ఆ తరువాత ఫిలిం ఛాంబర్ కి తారకరత్న భౌతిక దేహాన్ని తరలించాక అక్కడికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ విషయంలో చాలా మంది నెటిజన్లు తారకరత్న తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు. కోడలు పేరు మీద ఉన్నటువంటి ఇంట్లోకే వెళ్లలేదు.. అలాంటిది వారి పిల్లలను వీళ్లేలా చూసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కానీ ఈ విషయంలో బాలయ్య అలేఖ్యరెడ్డికి భరోసా ఇచ్చారు. తారకరత్న చనిపోయినా కూడా మీ బాధ్యతలు పూర్తిగా నావే అని చెప్పారు. బాలకృష్ణ చెప్పిన మాటలకు అలేఖ్యరెడ్డి కాస్త సంతోషపడిందనే చెప్పాలి.
Also Read : తారకరత్న ఇలా అవ్వడానికి తన కుటుంబమే కారణమా..?