టాలీవుడ్ చరిత్రలో చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చిరంజీవి నట ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో కూడా చిరంజీవి సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు తో చిరంజీవి మెకానిక్ అల్లుడు అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం కూడా చిరంజీవికి వచ్చింది కానీ ఐదు రోజుల షూటింగ్ తర్వాత చిరంజీవి స్థానంలో మోహన్ బాబును తీసుకున్నారు. ఆ సినిమా ఏంటి? మెగాస్టార్ ను ఎందుకు తీసేసారు అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఎన్టీఆర్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్ర కోసం మొదట చిరంజీవిని తీసుకున్నారు. అయితే సినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా నటించిన చిరంజీవి ఆయనను విభేదిస్తూ పవర్ఫుల్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవి కూడా పాత్రకు ఒప్పుకున్నారు. షూటింగ్ ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు షూటింగ్ జరిపారు. అయితే ఎన్టీఆర్ ను ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి తడబడ్డారు.
Advertisement
దానికి కారణం ఎన్టీఆర్ అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. దాంతో షూటింగ్ ఇలాగే జరిగితే కష్టమని మేకర్స్ భావించారు. నేపథ్యంలో చిరంజీవి స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబును తీసుకున్నారు. అలా మోహన్ బాబు, ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ఎన్టీఆర్ తో పోటీగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
READ ALSO : తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే…ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే?