Telugu News » Blog » తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే…ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే…ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే?

by Bunty
Ads

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.  తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు సంబంధించిన పరీక్ష నిర్వహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు.

Advertisement

Advertisement

ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వి వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్ ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల షెడ్యూల్ కింది విధంగా ఉంది.

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్

  • మే 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష.
  • మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలు.
  • మే 18న టీఎస్ ఎడ్సెట్
  • మే 20 న టీఎస్ ఈసెట్
  • మే 25న లాసెట్ (ఎల్.ఎల్.బి), పీజి లాసెట్
  • మే 26, 27న టిఎస్ పిజీ ఐసెట్
  • మే 29 నుంచి జూన్ 1 వరకు పిజి ఈసెట్ యు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

read also : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టైలర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్