Home » చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉందో తెలుసా…?

చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉందో తెలుసా…?

by AJAY
Ad

టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. చంద్రమోహన్ రంగులరాట్నం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. దాదాపు 900 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న చంద్రమోహన్ హీరోగా దాదాపు 175 సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Advertisement

చంద్రమోహన్ తన కెరీర్ లో జయప్రద, శ్రీదేవి, జయసుధ లాంటి స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. అలాంటి చంద్రమోహన్ కు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి పలుకుబడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చంద్రమోహన్ ఫ్యామిలీ నుండి ఒకరు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పారు.

Advertisement

తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని ఇద్దరు బాగుంటారని… చిన్నమ్మాయి చాలా బాగుంటుందని అన్నారు. వాళ్ళని చిన్నప్పుడు హీరోయిన్ భానుమతి చూసి పిల్లలు చాలా బాగున్నారు… చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేద్దామని అడిగినట్లు తెలిపారు. కానీ తాను సున్నితంగా తిరస్కరించానని అన్నారు. నటుడుగా బిజీగా ఉండడంతో తనకు పిల్లలతో సమయం గడిపేందుకు వీలయ్యేది కాదన్నారు. వాళ్లు లేవకముందే షూటింగ్ కు వెళ్లిపోయేవాడినని చెప్పారు.

Chandramohan daughter

Chandramohan daughter

భార్యా పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ తీసుకువెళ్లినా వాళ్లు తనను గుర్తుపట్టే వాళ్ళు కాదని చెప్పారు. ఒకసారి సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ షూటింగ్ ఎప్పుడు అడుగు అని అడుగుతారని భయం వేసేదని అన్నారు. సినిమా ప్రభావం వాళ్ళపై పడకుండా ఇద్దరినీ పెంచాలని అనుకున్నట్టు తెలిపారు. అలాగే పెంచామని ప్రస్తుతం ఇద్దరు బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఉందని అన్నారు.

Also read : మీనా త‌న భ‌ర్త‌పై గ‌తంలో చేసిన పోస్ట్ వైర‌ల్..అందులో ఏముందంటే..!

Visitors Are Also Reading