Home » అన్నపూర్ణమ్మ చేసిన చిన్న తప్పుకి “ఏం నువ్ చూసుకోలేవా?” అంటూ చిరంజీవి ఎందుకు కేకలు వేశారు ?

అన్నపూర్ణమ్మ చేసిన చిన్న తప్పుకి “ఏం నువ్ చూసుకోలేవా?” అంటూ చిరంజీవి ఎందుకు కేకలు వేశారు ?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ నటీమణుల్లో అన్నపూర్ణమ్మ గారు కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం హీరోల నుంచి చిరంజీవి, బాలకృష్ణ తరం హీరోలతో అలాగే అల్లు అర్జున్,ఎన్టీఆర్ తరం హీరోల వరకు ప్రతి ఒక్కరితో ఏదో ఒక క్యారెక్టర్ లో తెరను పంచుకుంది అన్నపూర్ణమ్మ. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. అలాంటి ఆమె ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

also read:Ajith Kumar : స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం..

Advertisement

తల్లి పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది అన్నపూర్ణమ్మ గారే.. అలాంటి అన్నపూర్ణమ్మ చిరంజీవితో అనేక సినిమాలు చేశానని తెలియజేసింది. సినిమా ఇండస్ట్రియల్ అలనాటి నటుడు జగ్గయ్య గారితో కూడా సినిమాలు చేశానని అన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన సమయంలో కాస్త ఇబ్బందులు పడ్డానని, ఎంత యాక్టింగ్ చేసినా కానీ లైట్ చూసుకోవడం నాకు చాలా రోజుల వరకు రాలేదని తెలియజేశారు. ఓ రోజు చిరంజీవి గారితో సినిమా షూటింగ్ జరుగుతోంది.నేను లైట్ చూసుకోకుండా నిలబడ్డాను. దీంతో చిరంజీవి లైట్ చూసుకోవా అంటూ కేకలు వేశారు. నీడలో నిలబడి చీకటిగా కనబడుతున్న సమయంలో చిరంజీవి గారు గట్టిగా అరిచారు.

Advertisement

also read:మ‌నోజ్ విష్ణు సొంత అన్న‌ద‌మ్ములు కాదా..? అప్ప‌టి నుండే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లున్నాయా..?

దీంతో నువ్వు ఉన్నావు కదా అన్నాను. అంటే నీ లైట్ నేను చూసుకోవాలా అంటూ చిరంజీవి గారు అన్నారని అన్నపూర్ణమ్మ తెలియజేశారు. అలా చిరంజీవి గారితో షూటింగ్ చేసే సమయంలో మొదటిసారి నాపై అలా అరిచారని చెప్పారు. షూటింగ్ సమయంలో చిరంజీవి చాలా బాగా మాట్లాడేవారని , ఏవైనా తెలియకుంటే వివరించేవారని, చిరంజీవిని అబ్బాయి అని పిలిచేదాన్ని అని అన్నపూర్ణమ్మ అప్పటి విషయాలను గుర్తు చేశారు. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

also read:మ‌నోజ్ విష్ణు సొంత అన్న‌ద‌మ్ములు కాదా..? అప్ప‌టి నుండే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లున్నాయా..?

Visitors Are Also Reading