Home » 45 ఏళ్లు క్రాస్ చేసిన‌ స‌బ్బ‌రాజు వ‌య‌సు….కానీ ఎందుకు పెళ్లిచేసుకోలేదో తెలుసా..?

45 ఏళ్లు క్రాస్ చేసిన‌ స‌బ్బ‌రాజు వ‌య‌సు….కానీ ఎందుకు పెళ్లిచేసుకోలేదో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కొంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా అభిమానులను సంపాదించుకుంటారు. న‌టుడు సుబ్బ‌రాజు కూడా అలాంటి వారే…ఆర‌డుగుల ఎత్తు అందంతో సుబ్బ‌రాజు హీరో క‌టౌట్ తో క‌నిపిస్తుంటాడు. దాంతో సుబ్బ‌రాజుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సుబ్బ‌రాజు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల‌లోనూ ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తుంటాడు.

Advertisement

 

అంతే కాకుండా పాజిటివ్ నెటిగివ్ ఇలా అన్నిర‌కాల పాత్ర‌ల‌ను కూడా చేస్తూ ఉంటాడు. మిర్చి సినిమాలో సుబ్బ‌రాజు మొద‌ట నెగిటివ్ రోల్ లో క‌నిపిస్తాడు. కానీ త‌ర‌వాత ప్ర‌భాస్ చెప్పిన మాట‌లు విని మంచివాడుగా మారుతాడు. అదే విధంగా బాహుబ‌లి సినిమాలో ఆయ‌న కామెడీ రోల్ కూడా ఇర‌గ‌దీశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బ‌రాజు సినిమాలు చాలా ఉన్నాయి.

Advertisement

అయితే ఆయ‌న సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ సుబ్బ‌రాజు ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. సుబ్బ‌రాజు వ‌య‌సు దాదాపు 45 ఏళ్ల పైనే ఉంటుంది. అంతే కాకుండా సుబ్బ‌రాజు ఇప్ప‌టికీ స్టిల్ సింగిల్ గా ఉండిపోయాడు. అయితే సుబ్బ‌రాజు పెళ్లి ఇంకా చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసుకోవాల‌ని చాలా మందికి ఉంటుంది.

కాగా ఓ ఇంట‌ర్వ్యూలో సుబ్బ‌రాజు దానికి స‌మాధానం ఇచ్చాడు.మీరు ఇంత వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేద‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా…అస‌లు పెళ్లి ఎందుకు చేసుకోవాలో త‌న‌కు అర్థం కాలేదని..అలాగే పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కూడా కార‌ణం ఉండ‌ద‌ని అన్నారు. త‌న‌కు పెళ్లి అవ‌స‌రం రాలేద‌ని..పెళ్లి జ‌ర‌గటం వేరు చేసుకోవ‌డం వేరు అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశాడు.

Visitors Are Also Reading