Home » Sridevi: శ్రీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్న యాక్టర్ మురళి మోహన్ ఎందుకు జరగలేదు ?

Sridevi: శ్రీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్న యాక్టర్ మురళి మోహన్ ఎందుకు జరగలేదు ?

by Srilakshmi Bharathi

అతిలోక సుందరి శ్రీదేవిని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆమె ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. చిన్నతనం లోనే శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తెలుగు నాట చాలా సినిమాల్లోనే హీరోయిన్ గా నటించారు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి తన సత్తా చాటిన సంగతి తెలిసిందే.

 

శ్రీదేవి తెలుగు నాట బాలనటిగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా మాత్రం “మా బంగారక్క”. ఈ సినిమాలో హీరో గా మురళి మోహన్ గారు నటించారు. అప్పట్లో మురళి మోహన్ గారు హీరోగా నటించే రోజుల్లో.. ఆయనకు బాగానే ఫాలోయింగ్ ఉండేది. ఆ టైం లో శ్రీదేవి తల్లి గారు ఆమెను మురళి మోహన్ కు ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకున్నారట. అయితే ఈ విషయం అప్పటికి మురళి మోహన్ కు తెలియదు. కానీ, అప్పటికే మురళి మోహన్ కు పెళ్లి అయ్యింది.

Boney Kapoor Reveals Sridevi Was On Extreme Diet Plan

అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి తల్లి మురళి మోహన్ కు పెళ్లి అయ్యిందన్న సంగతిని నమ్మలేదట. విషయం ఏమిటో చెప్పకుండా.. మురళి మోహన్ ఇంటికి వెళ్లిన శ్రీదేవి తల్లి.. ఆయనకు అప్పటికే పెళ్లి అయ్యింది అన్న విషయాన్నీ నిర్ధారించుకున్నారట. అందుకే.. శ్రీదేవిని మురళి మోహన్ కు ఇచ్చి పెళ్లి చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఆ తరువాత ఈ సంగతి మురళి మోహన్ కు తెలిసి ఆశ్చర్యపోయారట. ఈ విషయాలను స్వయంగా మురళి మోహన్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading