ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి అర్థంతరంగా రాజీనామా చేయడంతో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఆ దేశ ప్రజలు ఓటు వేశారు. ఇటలీ చరిత్రలో మొదటి సారిగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు. యువ ఓటర్ల సందడి మాత్రం అక్కడ పెద్దగా కనిపించలేదంటున్నారు. ఈ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ, ఫోర్జా ఇటాలియా, లెగా సెంటర్ రైట్, డెమొక్రటిక్ పార్టీ, ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, థర్డ్ పోల్, ఇటాలియన్ లెప్ట్, ఇటాలెగ్జిట్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. ప్రధాని పదవీకి మాజీ ప్రధాని సిల్వియో బెర్లు స్కోని, జార్జియా మెలోని, ఎన్రికో లెట్టా, మాంటియా సాల్విని, గుయ్ సేఫ్ కంటే ప్రధానంగా పోటీ పడుతున్నారు.
Advertisement
Advertisement
ఈ ఎన్నికల్లో నియోఫాసిస్ట్ మూలాలు ఉన్న బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి అత్యధిక సీట్లు సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇది వాస్తవం అయితే ఇటలీ చరిత్రలో మొదటిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలను చేపట్టనున్నారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నాయకురాలు జార్జియా మెలోని ప్రచారంతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రెండు వారాల క్రితం నిర్వహించిన చివరి ఓపినియన్ పోల్‌లో మెలోని నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ విజయం సాధిస్తుందని తేలింది. అంతేకాదు జార్జియా తనదైన శైలితో అందరినీ ఆకట్టుకుందని పలువురు పేర్కొంటున్నారు.
Also Read : Chanakya Niti : పురుషులు ఈ లక్షణాలు కలిగి ఉంటే మహిళలు ఇష్టపడతారు..!
2018లో జరిగిన ఎన్నికల్లో మెలోని పార్టీ కేవలం 4 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నా మూడేళ్ల కాలంలోనే అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీకి 47 శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. అక్టోబర్ 13 వరకు కొత్త పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో తదుపరి ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశముంది.
Also Read : బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చేసిన ట్వీట్ లో ఏముంది..?