విజయం శత్రువులను పెంచుతుందంటారు. చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది నూటికి నూరుశాతం నిజం. ఒకరి విజయాన్ని మరొకరు అస్సలు జీర్ణించుకోలేరు. ఇది ఆకాలంలో మరీ ఎక్కువగా ఉండేది. ఒక సినిమా విడుదల కాగానే అది ప్లాప్ అంటూ మొదటి రోజునే కొందరూ పుకార్లు పుట్టించేవారు. ఈ పుకార్లకు అగ్రహీరోలు సైతం భయపడేవారు.
ఆ మధ్య కాలంలో వరుస సినిమాలతో హిట్ టాక్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్‌కు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయట. ముఖ్యంగా ఉదయ్ కిరన్ నిర్మాతలను ఇబ్బందులు పెడుతున్నాడని కొందరూ అంటుండగా.. తన ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పరిశ్రమలోని కొందరూ బెదిరిస్తున్నారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే ఉదయ్‌కిరణ్ చిత్రం సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. దర్శకుడు తేజకు ఉదయ్ కిరణ్‌కు పడడం లేదని కూడా మరొక వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది.
Advertisement
Also Read: ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి బ్రేకప్ వరకూ అసలేం జరిగింది..!
అయితే నువ్వు-నేను శతదినోత్సవ వేడుకలకు హీరో ఉదయ్‌కిరణ్ ఆలస్యంగా రావడంతో ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్టు అయింది. వాస్తవానికి ఉదయ్ కిరణ్‌కు నువ్వు నేను తొలి శతదినోత్సవ వేడుక. చిత్రం సినిమా వంద రోజులు ఆడినప్పటికీ శతదినోత్సవం జరుపలేదు. అయితే చిత్ర బృందం హీరో కోసం ఎదురు చూడకుండా కార్యక్రమాన్ని జరిపించడం గమనార్హం. ఇదే విషయం ఉదయ్ కిరణ్‌ను అడిగితే శత దినోత్సవం అంటే గెట్ టూ గెదర్ లాంటిది అనుకున్నాను. అందుకే ఆలస్యంగా వచ్చాను. ఆ రోజు సాయంత్రమే నాకు ఆహ్వానం అందింది అన్నారు.
Advertisement
Also Read: ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే..!
మరొక వైపు ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని చిత్రం స్క్రిప్ట్‌ను వక్కంతం వంశీ రాయగా.. అది బాగోలేదని ఉదయ్ కిరణ్ దానిని తిరిగి రాయించాల్సిందిగా కోరారట. దీంతో నిర్మాణ సంస్థకు సన్నిహితుడైన కృష్ణవంశీ స్క్రిప్ట్ చక్కదిద్దే బాధ్యతను స్వీకరించాడు. కృష్ణవంశీ స్క్రిప్ట్‌ను చక్కదిద్దితే నేను కాదు నిర్మాతలు కూడా సంతోషపడ్డారు. సాధారణంగా అగ్ర హీరోలే స్క్రిప్ట్ విషయంలో తలదూర్చుతారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఉదయ్ కిరణ్ స్ట్రిక్ట్‌గా ఉండి దానిని మార్చాల్సిందేనని చెప్పడంతో కాస్త వివాదంగా మారింది.
వరుస మూడు హిట్లు ఇచ్చినంత మాత్రానా తన తదుపరి చిత్రం ప్లాప్ కావాలని కోరుకోను అని, అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. ఉదయ్‌కిరణ్‌కు అప్పట్లో పరిశ్రమ లోని కొంత మంది వ్యక్తుల వల్ల బెదిరింపుల కాల్స్ కూడా మొదలయ్యాయని వినికిడి. వరుస హిట్‌లు తట్టుకోలేకే ఇలాంటి పనులు చేసేవారని.. ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఈ విషయాన్ని ఉదయ్‌కిరణ్ అప్పటి మా అధ్యక్షుడు నాగార్జునతో చర్చించారు. ఇక కలుసుకోవాలని అనే చిత్రం మూడు సెంటర్లలో 100 రోజులు ఆడి పర్వాలేదు అనిపించింది.
Also Read : బాలకృష్ణ నటించిన తొలి సినిమా బ్యాన్ అయిందని మీకు తెలుసా ? ఎందుకంటే..?