ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలలో అత్యధిక ఏజ్ కలిగి ఉన్న హీరోల్లో రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు అందనంత ఎత్తులో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా ఆయన చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అలాంటి రజినీకాంత్ బస్సు కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం వెనుక అనేక కష్టాలున్నాయి..
Advertisement
Also Read:సోనాలి బింద్రే నుండి సమంత వరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన మహిళా నటీమణులు..!!
అలాంటి ఆయన పేరుతో పాటుగా చాలా సంపాదించారు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన రజనీకాంత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. రజనీకాంత్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన సినిమాల్లోకి వచ్చే టైం లోనే తన తల్లిని కోల్పోయారు.. ఆ తర్వాత ఒక తల్లి దగ్గరికి తీసుకొని ప్రేమను పంచిందని, తల్లి లేని లోటును భర్తీ చేసిందని రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ టైంలో నాకు పెళ్లి కాలేదని చాలా బిజీగా ఉన్నానని అన్నారు.
Advertisement
Also Read:Women’s day: డైరెక్టర్లుగా రాణిస్తున్న మహిళ మణులు.. ఎవరో తెలుసా..?
షూటింగ్ సమయంలో రెజీనా అనే మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమె ఇతరులకు సహాయం చేసే మంచి మనసున్న మహిళ అని రజనీకాంత్ వెల్లడించారు. ఆమె అమ్మ ప్రేమను పంచారని తాను పని ఒత్తిడి వల్ల ఆసుపత్రిలో చేరితే రెజినా అమ్మ నాకు అన్ని సఫర్యాలు చేశారని రజనీకాంత్ తెలియజేశారు. ఆ తల్లి వల్లే నేను మామూలు మనిషిని అయ్యానని కామెంట్ చేశారు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఆ మహిళ గురించి ఆయన ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటున్నారు.
Also Read:రవితేజ రావణాసురాలో సీతమ్మపై డైలాగ్.. తల్లిని అవమానిస్తారా అంటూ ట్రోల్స్..!!