Home » టాలీవుడ్ టాప్ 10 జాబితాలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ టాప్ 10 జాబితాలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే..?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోల విషయంలోనే కాదు హీరోయిన్ల విషయంలో కూడా నంబర్ వన్ ఎవరు అనే టాపిక్ ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టాప్ టెన్ హీరోయిన్స్ లో నెంబర్ వన్ ఎవరు? 9 మందిని వెనక్కి నెట్టి ముందుకు వచ్చేది ఎవరు? అంటూ ప్రతి ఒక్కరు ఆత్రుతగా తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇది ఏ జాబితాకి సంబంధించింది అంటే.. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎవరు నిలవబోతున్నారు అనే విషయంపై మరింత ఉత్కంఠ నెలకొంది.


అసలు విషయంలోకి వెళితే జనవరి 12 నుంచి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల జాతర మొదలవుతోంది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉండగా.. హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్, సైంధవ్ లో శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా నటిస్తున్నారు. ఇక నా సామిరంగా సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథన్, మిర్నా మీనాన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇంతమంది హీరోయిన్లతో థియేటర్లన్నీ కూడా కళకళలాడతున్నాయి.

Advertisement

ఇకపోతే ఇప్పటికే శ్రీలీల ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. మీనాక్షి కూడా సక్సెస్ లోనే కనిపిస్తోంది. ఇక వీరిద్దరూ కూడా ఒకే సినిమాతో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇక శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ, అండ్రియా కూడా కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఇచ్చారు. ముగ్గురు కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మిగతా భామలు కూడా అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇలా ఇంతమంది భామలు ఒకేసారి పోటీ పడుతున్నారు. దీంతో సంక్రాంతి రేసులో నిలిచేది ఎవరు? టాప్ టెన్ జాబితాలో నెంబర్ వన్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాల కోసం ఎదురు చూడాల్సిందే.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి..!

Visitors Are Also Reading