సినీ ఇండస్ట్రీ అన్న తరువాత ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ అందులో టాలెంట్ ఉన్న వారు మాత్రమే ఇండస్ట్రీలో చాలా రోజుల పాటు కొనసాగుతుంటారు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఎంతో మంది యువ హీరోలకు వీళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారిలో తొలుత ఇండస్ట్రీలో చెప్పుకోవాల్సింది నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి.
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వీరు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఇబ్బందులను సైతం ఓర్చుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలను 3 జనరేషన్‌లుగా వర్ణిస్తుంటారు. ఒకటి ఎన్టీఆర్ తరం, రెండోది మెగాస్టార్ చిరంజీవి తరం, మూడోది నేటి తరం. ఎన్టీఆర్ చిరంజీవి ఉన్నప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలున్నప్పటికీ ఆ తరానికి వీళ్లే స్టార్ హీరోలు అని పేరు తెచ్చుకున్నారు. నందమూరి తారక రామారావు పౌరాణిక పాత్రలైన రావణాసురుడు, కృష్ణుడు, రాముడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలు పోషించాడు.
Advertisement
Advertisement
ఎన్టీఆర్ తరువాత మాత్రం ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి మాత్రమే అప్పుడున్న హీరోలందరి లో స్టార్ అయ్యారు. ఎన్టీఆర్ మాదిరిగా పౌరాణిక పాత్రలు మాత్రం వేసి ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాడు. తనదైన స్టైల్ లో స్టెప్పులు వేస్తూ అంతకు మించిన నటనా చాతుర్యాన్ని కనబరుస్తూ టాలీవుడ్ ఇండస్ట్ట్రీకి కొత్త ట్రెండ్ పరిచయం చేశాడు చిరంజీవి. రెండు తరాలకు తరానికి ఒక్కరూ అన్న రీతిలో ఎన్టీఆర్, చిరంజీవి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటితరం హీరోలుగా ఉన్న ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరూ ఎవరో ఒకరి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇక ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఈ తరానికి ఏ హీరో స్టార్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సిందే.
Also Read :
శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నారా..? వారి లైప్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన
సమంతతో కలిసి నాగచైతన్య నటిస్తారా..? దీనిపై ఆయన ఏమన్నారంటే..?