సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా ఇద్దరినీ పెళ్లి చేసుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. కృష్ణ తన మేనమామ కూతురు అయిన ఇందిరా దేవిని మొదటగా వివాహం చేసుకున్నారు. అయితే కృష్ణ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఎక్కువగా హీరోయిన్ విజయనిర్మలతో సినిమాలు చేశారు. ఈ తరుణంలో ప్రేమలో పడి, కృష్ణ-విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా, విజయనిర్మల-కృష్ణ పెళ్లి కాయమని అప్పటి స్టార్ కమెడియన్ పుణ్యమూర్తుల రాజబాబు ముందుగానే ఊహించి చెప్పారు.
Advertisement
Advertisement
అసలు ఏం జరిగిందంటే, 1967 లో వచ్చిన బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అనే విషయం తెలిసింది. ఈ సినిమాలో కృష్ణ-విజయనిర్మల హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక, ఈ సినిమా షూటింగ్ గోదావరి తీరంలోని పులిదిండిలో జరిగింది. దర్శకుడు బాపు, గ్రామంలోని మీసాల కృష్ణుడి గుడిలో వీరిద్దరిపై ఓ సీన్ ప్లాన్ చేశారు. ఆ సీన్ లో ఇద్దరు నూతన దంపతులకు గెటప్ లో కనిపిస్తారు. షూటింగ్ ప్రారంభమైంది.
కట్ చెప్పారు. ఇక, ఇదంతా గమనిస్తున్న రాజబాబు ఓ కామెంట్ చేశారట, ఈ గుడి చాలా మహిమ కలదని, ఇక్కడ జరిగే ఘటనలో నిజ జీవితంలోను జరుగుతాయి అని వాక్యానించారట. ఈ నేపథ్యంలో కృష్ణ-విజయనిర్మల విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని కూడా అన్నారట. యాదృచ్ఛికంగా ఆ తర్వాత రెండేళ్లకే కృష్ణ-విజయ నిర్మల తిరుపతిలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కావడం గమనార్హం.
READ ALSO : IPL వేలంలో జాక్ పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి