వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది. ఓపెనర్ డేవన్ కాన్వే భారీ సెంచరీ చేశాడు. 121 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు సాధించాడు. వన్డేల్లో బ్యాటింగ్ కి దిగిన రచన్ రవీంద్ర సెంచరీతో ఆకట్టుకున్నాడు. రచిన్ రవీంద్ర 96 బాల్స్ లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో నిప్పులు చెరుగుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 123 పరుగులతో నాటౌట్ గా నిలిచి న్యూజిలాండ్ ను గెలిపించాడు. ప్రస్తుతం ఉన్న క్రికెట్ వర్గాల్లో రచిన్ రవీంద్ర మారుమ్రోగిపోతుంది.
23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ తరపున సెంచరీ సాధించిన అత్యంత భిన్న వయస్కుడు అయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు బౌలింగ్ లోను సత్తాచాటి కీలకమైన హ్యారీ బృక్ వికెట్ ను పడగొట్టాడు. ఇంతకీ రచన్ రవీంద్ర మరెవరో కాదు మన ఇండియన్ కుర్రాడే. రచిన్ రవీంద్ర పుట్టకముందే అతని కుటుంబసభ్యులు న్యూజిలాండ్ కు వెళ్లిపోయారు. తండ్రి రవి కృష్ణమూర్తి బెంగళూరులోని పుట్టి పెరిగాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ గా పనిచేసేవాడు. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కావడంతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ హాట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ను ప్రారంభించాడు. రవీంద్రకు అలా చిన్ననాటి నుండి క్రికెట్ పై ఇష్టం పెరిగింది. పైగా తండ్రి నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.
Advertisement
Advertisement
2016-2018లో న్యూజిలాండ్ తరపున అండర్-19 ప్రపంచ కప్ ను ఆడాడు. 2018-19 సీజన్ లో లిస్ట్ ఏ క్రికెట్లో పాకిస్తాన్ పై అరంగేట్రం చేశాడు. ఫోర్ ఏ ట్రోఫీలో లిస్ట్ ఏలో ఫస్ట్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. 2021 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచటెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు ఎంపిక అయ్యాడు. కాకపోతే తుది జట్టులో స్థానం దక్కలేదు దక్కకపోవడంతో డగౌట్ కి పరిమితం అయ్యాడు. రచిన్ రవీంద్ర 2023 వన్డేలో అరంగేట్రం చేశాడు. కాగా, హాట్ హాక్స్ టోర్నమెంట్ కోసం… న్యూజిలాండ్ నుంచి అనంతరం పురం వచ్చి క్రికెట్ ఆడేవాడట రవీంద్ర.
ఇవి కూడా చదవండి
- వారి టార్చర్ కారణంగానే జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుందా ?
- పవన్ కళ్యాణ్ సినిమాతో భారీ లాస్..కానీ NTR సేవ్ చేశాడా ?
- Shubman Gill : టీమిండియాకు భారీ షాక్.. గిల్ కు తీవ్ర అనారోగ్యం!