తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఈ సిమిమాను థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సినిమా కథ రియల్ స్టోరీ అని తెలియడంతో జస్టిస్ చంద్రు ఎవరు అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా చంద్రు…ఎందుకంత పాపులర్ అయ్యాడు అన్నది తెలుసుకుందాం…. తనకు 16సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండే జస్టిస్ చంద్రు అనగారిన వర్గాల కోసం పోరాడేవారు. లా పూర్తి చేసిన తరవాత చంద్రు 1990 లో అనగారిన వర్గాల వారికోసం చంద్రు పోరాడాలరు. వారి కేసులో కోసం పోరాడే సమయంలో చంద్రు ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదు. కుల వ్యవస్థను రూపు మాపడానికి చంద్రు ఎంతో కృషి చేసేవారు.
2006లో మద్రాసు హైకోర్టుగా అదనపు న్యాయమూర్తిగా చంద్రు నియమితులయ్యారు. అంతే కాకుండా అదే హైకోర్టుకు 2009 నవంబర్ తొమ్మిదిన పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మర్చి వరకూ జడ్జిగా పనిచేశారు. ఈ 6 సంవత్సరాలలో 90వేల కేసులకు ఆయన తీర్పును ఇచ్చారట. లాయర్ గా ఉన్న సమయంలో ఎలాంటి హక్కుల కోసం పోరాడారో న్యాయమూర్తిగా నియమితులయ్యాక కూడా అవే హక్కుల కోసం చంద్రు పనిచేశారట. చెన్నై కోర్టులో సినిమాలో చూపించిన లాకప్ డెత్ గురించి చంద్రు పోరాడాటర.
Advertisement
Advertisement
అంతే కాకుండా తాను జడ్జిగా పనిచేసిన సమయంలో తన సెక్యురిటీని నిరాకరించాట. తనకు ఇచ్చిన కారును కూడా వద్దని చెప్పి నిరాకరించారట. జిడ్జిగా ఉన్న సమయంలోనూ లోకల్ ట్రైన్ లో ప్రయాణించారట. అక్కడితో ఆగకుండా చంద్రు తనను మై లార్డ్ అని పిలవొద్దని లాయర్ లకు చెప్పేవారట. తన ఆఫీసు ముందు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వవద్దని బోర్డులు పెట్టించారట. స్మశాన వాటికల్లో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించారట. మహిళల రక్షణ కోసం కూడా ఆయన కీలక తీర్పులు ఇచ్చారట. ఇక మొదట చంద్రు కథను డాక్యుమెంటరీ గా తీయాలనుకున్నారట కానీ సూర్య, జ్యోతికలు ముందుకు వచ్చి సొంత బ్యానర్ లో సినిమాగా తీశారట.
Also Read: VIRAL VIDEO : షట్లర్ సింధూ స్టెప్పులు నెటిజన్లు ఫిదా..!