Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » VIRAL VIDEO : షట్లర్ సింధూ స్టెప్పులు నెటిజన్లు ఫిదా..!

VIRAL VIDEO : షట్లర్ సింధూ స్టెప్పులు నెటిజన్లు ఫిదా..!

by AJAY
Published: Last Updated on

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్పోర్ట్స్ డ్రెస్ లో షటిల్ ఆడటం అందరూ చూసి ఉంటారు. కానీ పథకాలు తీసుకువచ్చిన సింధులో మరో టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది. పివి సింధు దీపావళి సందర్భంగా ఇన్స్టా గ్రామ్ లో ఓ రీల్ పెట్టింది. ఈ రీల్ వీడియోలో పివి సింధు పాప్ సింగర్ సీకే పాడిన లవ్ వాటిటి నే పాటకు డాన్స్ చేసింది. కాంచీపురం లేహంగాలో లో పి.వి.సింధు ఈ పాటకు స్టెప్పులు వేసింది.

Ad

గ్రీన్ కలర్ లో ఉన్న లేహాంగా లో సింధు ఎంతో అందంగా కనిపిస్తుందని…ఈ డ్యాన్స్ కు తాము ఫిదా అయ్యామని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం సింధు డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ పాట మిలియన్ వ్యూవ్స్ ను దాటేసింది. ఈ వీడియోకు సింధు మ్యూజిక్ డాన్స్… డాన్స్ లవ్… ట్రెడిషనల్ డ్యాన్స్ అంటూ హాష్ టాగ్ లు జోడించింది.

ఇదిలా ఉండగా పివి సింధు ఇటీవల భారత్ కు పతకాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రీడారంగంలో సింధు చేసిన విశేష కృషికి గాను ఆమెను రీసెంట్ గా పద్మభూషణ్ తో సత్కరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పి.వి.సింధు పద్మభూషణ్ అందుకుంది. ఇక పథకాన్ని గెలిచిన సింధుకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు బహుమతులు ఇచ్చాయి. అంతేకాకుండా వైజాగ్ లో పీవీ సింధు బ్యాట్మింటన్ క్లబ్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది.

https://www.instagram.com/reel/CV-HAB7gmZN/?utm_medium=copy_link

Visitors Are Also Reading