Home » హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బెటర్..? డైరెక్టర్ కృష్ణవంశీ ఏమన్నారంటే..?

హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బెటర్..? డైరెక్టర్ కృష్ణవంశీ ఏమన్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీని చూసిన వారికి కృష్ణవంశీ తీసిన శ్రీ ఆంజనేయం సినిమా కూడా గుర్తుకు వస్తుంది. హనుమాన్ మూవీ ట్రెండ్ అయిన సమయంలో శ్రీ ఆంజనేయం చిత్రంలోని కొన్ని సీన్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో అప్పుడు ఉన్న టెక్నాలజీ ఓ విజువల్ వండర్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో ఛార్మి నితిన్ ట్రాక్.. పాటల్లో మరీ ఓవర్ ఎక్స్ పోజింగ్ ఇలా చాలా కారణాలతో సినిమా అందరినీ ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలో శ్రీఆంజనేయం కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయింది. 

Advertisement

హనుమాన్ మూవీ వీక్షించిన ఓ నెటిజన్.. శ్రీ ఆంజనేయం సినిమానే తనకు బాగా బెటర్ అనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు. దానికి కృష్ణవంశీ ఎంతో హుందాగా స్పందించాడు. ఆడియెన్స్ ఎప్పుడూ తప్పు కాదు.. వాళ్లకు సినిమా నచ్చలేదంటే.. అందులో ఏదో సమస్య ఉన్నట్టే.. వారికి సరిగ్గా రీచ్ అవ్వలేదు. అందుకే ప్రేక్షకులను నిందించకండి. కొన్ని పోర్షన్స్ లో నా తప్పు కూడా ఉంది. అంటూ తన తప్పులను ఎంతో హుందాగా ఒప్పుకున్నాడు డైరెక్టర్ కృష్ణవంశీ. ఎంత హుందాగా స్పందించారు సర్.. మీరు నిజం చెప్పారు. ఆడియెన్స్ ఎప్పుడూ రాంగ్ కాదు సర్ అంటూ కృష్ణవంశీ ట్వీట్ మీద నెటిజన్స్ స్పందించారు. కృష్ణవంశీ చివరగా రంగ మార్తాండ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

Advertisement

కానీ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ కమర్షియల్ గా థియేటర్ లో అంతగా ఆడలేదు. ఓటీటీలో రంగమార్తండ అందరినీ కదిలించిన సంగతి తెలిసిందే. హనుమాన్ మూవీ ప్రమోషన్స్ సమయంలో ప్రశాంత్ వర్మ శ్రీ ఆంజనేయం గురించి స్పందించాడు. శ్రీ ఆంజనేయం సినిమా కథ వేరు.. అందులో హీరో అమాయకుడు అని.. ఇందులో మరీ అంత కాదని.. కాస్త తుంటరి, అల్లరి దొంగోడు అని ఫన్నీగా స్పందించిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీ 300 సెంటర్లలో 30 రోజులు విజయవంతంగా ఆడిందని.. ఇంకా రన్ అవుతోందంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. 

Also Read : అల్లు రామలింగయ్య ఎంత చెప్పినా వినకుండా ఆ సినిమా చేసి చిరంజీవి ఫ్లాప్ అందుకున్నాడా..?

Visitors Are Also Reading