కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన వెయ్యికి పైగా సినిమాలు చేసే మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కమెడియన్ గానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలు చేసి అందర్నీ ఎంటర్టైన్ చేశారు. ఇది ఇలా ఉంటే కోటాలో మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆయన ఎలాంటి యాసలో అయినా మాట్లాడగలుగుతారు. తెలంగాణ అయినా సరే గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు ఇలా ఏ యాస అయినా కూడా ఆయన చక్కగా మాట్లాడుతారు. కోట జీవితంలో ఒక అవమానం ఉందట అది కూడా స్టార్ హీరో వల్ల.
ఆయన ఎవరో కాదు బాలకృష్ణ. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రోజు షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్ళాను. అప్పుడు బాలకృష్ణ సైతం ఆ షూటింగ్ కి వచ్చారు. రాజమండ్రి హోటల్లో లిఫ్ట్ దగ్గర ఎదురుచూస్తున్నాను. కొంతమంది దూరంగా ఉండమని సైగలు చేస్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు అని కోట చెప్పారు. అప్పుడు బాలయ్య వస్తున్నట్లు అర్ధమైందని మర్యాదపూర్వకంగా ఆయనకు నమస్కారం చేసానని అన్నారు.
Also read:
అయితే ఆయన నా మీద ఉమ్మి వేశారని.. ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదని చెప్పారు. బాలయ్యకు కోటా శ్రీనివాసరావు మీద కోపం ఎందుకు వచ్చింది అనేది తెలీదు. బాలయ్య మూడ్ గురించి మనకి తెలిసిందే. బాలయ్య ప్రవర్తన చాలా సార్లు వివాదాస్పదమైంది. ప్రేమగా దగ్గరకు వెళ్ళిన ఫ్యాన్స్ ని కూడా ఆయన కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఆ మధ్య అంజలీ పట్ల బాలయ్య ప్రవర్తన కూడా వివాదాస్పదమైంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!