Home » ఐపీఎల్ 2022 సీజన్ లో ఏ జట్టు ఎక్కువ సిక్సులు ఇచ్చిందో మీకు తెలుసా..?

ఐపీఎల్ 2022 సీజన్ లో ఏ జట్టు ఎక్కువ సిక్సులు ఇచ్చిందో మీకు తెలుసా..?

by Azhar
Ad
రెండు కొత్త జట్ల రాకతో మొత్తం 10 జట్లతో ఐపీఎల్ 2022  విజయవంతంగా ముగిసింది. కరోనా కారణంగా కేవలం ముంబైలోని నాలుగు స్టేడియాలలోనే మొత్తం లీగ్ మ్యాచ్ లు నిర్వహించింది బీసీసీఐ. అందువల్ల పించ్ అనేది మ్యాచ్ జరుగుతున్న కొద్ది కొంచెం బ్యాటర్లకు అనుకూలించడం ప్రారంభమైనది. దానికి తోడుగా ఈ ఐపీఎల్ లో బ్యాటర్లు ఫుల్ స్వింగ్ లో ఉండటంతో గత 14 సీజన్లలో జరగని ఘటన ఈ సీజన్ లో జరిగింది. ఈ సీజన్ లో సిక్సర్లు అనేవి 1000 మార్కును దాటేసి ఏకంగా 1062 కు చేరుకున్నాయి. అయితే ఇన్ని సిక్స్ లలో ఏ జట్టు మిగిలిన జట్ల కంటే ఎక్కువ సిక్సులు ఇచ్చింది అనేది చూద్దాం.
ఈ మొత్తం సిక్స్ లలో అన్నిటికంటే రాయల్ ఛాలెంజర్స్ జట్టు అత్యధిక సిక్సులు సమర్పించుకుంది. ఈ ఏడాది బెంగళూర్ బోలర్లు ఏకంగా 147 సిక్సులు ఇచ్చారు. ఇందులో సిరాజ్, హాసరంగా ఇద్దరే 61 సిక్సులు ఇవగం గమనార్హం. ఆ తర్వాత రెండో స్థానంలో 113 సిక్సులతో ఐపీఎల్ 2022 రన్నరప్ అయిన రాజస్థాన్ రాయల్ ఉంది. అలాగే ఒక్క సిక్స్ తక్కువగా 112 సిక్సులతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఇక 111 సిక్సులతో నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచింది.
అదే విధంగా 104 సిక్సులతో కోల్కతా నైట్ రైడర్స్  5వ స్థానంలో, 103 సిక్సులతో ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో ఉంటె.. 101 సిక్సులతో ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలో ఉంది. అలాగే 94 సిక్సులతో లక్నో సూపర్ జెయింట్స్ 8వ ప్లేస్, 91 సిక్స్‌లతో పంజాబ్ కింగ్స్ 9వ ప్లేస్ లో ఉంది. ఇక అన్ని జట్ల కంటే తక్కువ సిక్సులు ఇచ్చిన జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టు 14 మ్యాచ్ లలో కేవలం 86 సిక్సులు మాత్రమే ఇచ్చింది. అంటే ఈ జట్టు బౌలర్లు ఎలా బౌన్గ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

Visitors Are Also Reading