Home » యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన సినిమాలివే?

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన సినిమాలివే?

by aravind poju
Ad

యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు బుల్లి తెర ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. యాంకరింగ్ కే పర్యాయపదంగా నిలుస్తూ గలగలా మాట్లాడుతూ హుషారైన యాంకరింగ్ తో కార్యక్రమానికే సుమ క్రేజ్ తెచ్చిపెడుతుందంటే అతిశయోక్తి కాదు. సుమ యాంకరింగ్ తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమా పేరు రిజిస్టర్ అయిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మాటల మాంత్రికురాలు అని మనం అనుకోవచ్చు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆడియో ఫంక్షన్ లకు మొదటగా సుమను ఎంచుకుంటారంటే సుమకు ఉన్న క్రేజ్ ఎంతటిదో మనం అర్దం చేసుకోవచ్చు.

 

Advertisement

అయితే యాంకర్ సుమకు సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసు. కానీ ఆమె గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ సుమ ఇల్లు గురించి అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడూ సుమ ఇల్లు గురించి మనకు తెలియదు కదా. అంతగా సుమ ఇంటికి ఉండే స్పెషాలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. సుమ అప్పుడప్పుడు ఏదో ఒక పండగ సందర్భంలో వారి ఇంట్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఆ ఫోటోలను చూస్తే ఈ ఇల్లును ఎక్కడో మనం చూసినట్లు ఉందే అని మనకు అనిపిస్తూ ఉంటుంది.

Advertisement

 

అయితే సుమ ఇంట్లో చాలా సూపర్ హిట్ సినిమాల షూటింగ్స్ జరిగాయని మీకు తెలుసా. ఆ సినిమాలేమిటో తెలుసుకోవాలని మీకు చాలా ఆసక్తిగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి. 100% లవ్ సినిమాలో నాగచైతన్య ఇల్లుగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్ షా సినిమాలో కాజల్ ఇల్లుగా, బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ ఇల్లుగా, దూకుడు మహేష్ బాబు ఇల్లుగా, పూల రంగడులో విలన్ ఇల్లుగా జరిగిన షూటింగ్ అంతా సుమ ఇంట్లోనే జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకున్నాం కదా.

Also Read: హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు వీరే..!

Visitors Are Also Reading