Home » హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు వీరే..!

హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు వీరే..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్ ల కుమారులు కూడా హీరో లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే కొంతమంది హీరోలుగా సక్సెస్ అవ్వగా మరికొందరు సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక మరికొందరు దర్శకుల వారసులు సినిమాల్లో సక్సెస్ అవ్వలేక వదిలిపెట్టినవారు కూడా ఉన్నారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుల వారసులు ఎవరో ఇప్పుడు చూద్దాం…..

నిర్మాతగా మరియు దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రవి రాజా కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా అటు హీరోగా ఇటు విలన్ గానూ ఆది ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: వారెవ్వా… ఏకంగా భార్య కోసం ఇంటినే తాజ్ మహల్ గా మార్చాడు… ఎక్కడంటే?

adi-pinisetty-family

టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు ఈవీవీ సత్యనారాయణ. ఎన్నో సినిమాలు తీసి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈవీవీ వారసులుగా ఆర్యన్ రాజేష్ మరియు అల్లరి నరేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వారిలో ఆర్యన్ రాజేష్ సినిమాలకు దూరం అవ్వగా ….అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నరేష్ కేవలం కామెడీ సినిమాలతోనే కాకుండా ఏ పాత్ర చేసినా తన నటనతో ప్రేక్షకులను మాయ చేస్తున్నారు.

Advertisement

allari-naresh-father-evv

allari-naresh-father-evv

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాత్ తనయుడు ఆకాష్ పూరి కూడా టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు. బుజ్జిగాడు సినిమాలో బుజ్జి ప్రభాస్ గా నటించిన ఆకాష్ పూరి ప్రస్తుతం ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆకాష్ పూరి రొమాంటిక్ అనే చిత్రంలో నటించగా ఈ సినిమాలో తనయుడి కోసం పూరీ జగన్నాథ్ లక్డికపూల్ అంటూ ఓ పాట రాసి పాడారు.

puri-jagnadh-family

puri-jagnadh-family

మ్యాచో మ్యాన్ గోపీచంద్ తండ్రి కూడా ఓ దర్శకుడు అనే విషయం అతికొద్ది మందికే తెలుసేమో…కానీ గోపీచంద్ తండ్రి టి. కృష్ణ నేటి భారతం, దేశంలో దొంగల ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలకు ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక డైరెక్టర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ప్రస్తుతం హీరోగా మరియు విలన్ గా రాణిస్తున్నారు.

టాలీవుడ్ కు రీసెంట్ గా పరిచయం అయిన హీరో సంతోష్ శోభన్ తండ్రి కూడా ఓ దర్శకుడే. వర్షం, బాబీ, రవితేజ చంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శోభన్ కుమారుడే సంతోష్ శోభన్…

ప్రస్తుతం ఈ యంగ్ హీరో యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికే పేపర్ బాయ్, ఏక్ మిని కథ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

Also Read: యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన సినిమాలివే?

Visitors Are Also Reading