పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలను తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ప్రోటీన్, క్యాల్షియం ఇతర ముఖ్యమైన మినరల్స్ పాలల్లో ఉంటాయి. పాలను తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండవచ్చు. పిల్లలకి కూడా ప్రతి రోజు పాలను ఇవ్వడం మంచిది. పాలు తాగడం వలన ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి బోలి ఎముకల వ్యాధిని నిరోధించవచ్చు. పిల్లల్లో సరైన ఎముక పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆవు పాలల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కండరాల పెరుగుదల మొత్తం శరీర పని తీరుకు అవసరమైన ఏమైనా ఆమ్లాలని ఇస్తుంది.
Advertisement
పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయి. ఆవు పాలల్లో క్యాల్షియం, బాస్వరం, విటమిన్-డి ఉంటాయి ఎముకలకు దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారించడానికి సరైన ఎముక సాంద్రతను నిర్ధారించడానికి కీలకమని చెప్పొచ్చు. కండరాల పెరుగుదలకు ఆవు పాలల్లో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఉపయోగపడుతుంది.
Advertisement
Also read:
ఆవు పాలతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అలానే ఆవు పాలను తీసుకోవడం వలన బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది. గేదె పాలల్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది కొవ్వులో కరిగే విటమిన్లు శోషణలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. గేదె పాలు గుండెకి కూడా మంచిది. తక్కువ కొలెస్ట్రాల్ కూడా కలిగి ఉంటాయి. అధిక లాక్టోస్ కంటెంట్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి రెండు పాలు కూడా చక్కటి ప్రయోజనాలు ఇస్తాయి. రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. రుచిని బట్టి కొంతమంది ఆవు పాలను కొంతమంది గేదె పాలను తీసుకుంటారు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!