Home » తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..?

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..?

by Anji
Ad

తెలంగాణలో మరికొన్ని నెలల్లో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. అవును మీరు విన్నది నిజమే!, మరి కొన్ని నెలల్లో తెలంగాణలో మూడు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలపై ఇంకా నోటిఫికేషన్ రాలేదు. లోక్ సభ ఎన్నికలకు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించాయి.

Advertisement

Advertisement

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకుస్పందించలేదు. ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్, ఉపసర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాలి. షెడ్యూల్ రాకపోవడంతో ప్రత్యేక అధికారులకు భాద్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్పంచులు రిక్వెస్ట్ చేస్తున్నారట. గత ప్రభుత్వం లో ఉన్న పెండింగ్ బిల్లులు ఇంకా రాలేదని.. అందుకోసం తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నారట. వారి అభ్యర్థనలు విన్న రేవంత్ సర్కార్ వారి పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 

Visitors Are Also Reading