సాధారణంగా నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరం ఆహారం లేకుండా వారం రోజుల వరకు ఉండగలదేమో కానీ నీళ్లు లేకుండా అసలు ఒక రోజు కూడా ఉండలేదు. శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండాలంటే తప్పకుండా వాటర్ తాగాల్సిందే. ఒక వ్యక్తి రోజుకు కనీసం 3 లీటర్ల వాటర్ తాగాలని వైద్యులు చెబుతున్నారు. సరిపడినంత నీరు తాగకపోతే చర్మం నిర్జీవంగా కనిపిస్తూ పొడి బారుతుంది. అంతేకాదు.. కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసమే మంచినీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది అని వైద్య నిపుణులు చెబుతుంటారు.
అయితే భోజనం మధ్యలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదా..? తినే సమయంలో ఏయే సందర్భాల్లో నీళ్లు తాగాలి అనే దానిపై అవగాహన తప్పకుండా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడానికి కష్టమవుతుందని వినే ఉంటారు. టాక్సిన్స్ పేరుకుపోవడానికి అవకాశం ఉంటుందని ఆయుర్వేదం కూడా భోజనం మధ్యలో నీరు తీసుకోకూడదనే చెబుతోంది. భోజనంతో పాటు నీరు తాగడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను శోషించడం అనేది పలుచగా చేస్తుంది. దీంతో ఆహారం జీర్ణం కావడం ఆలస్యం అవుతుంది.
Advertisement
Also Read : రేగు చెట్టు ఆకుల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Advertisement
కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం వల్ల దాహంగా అనిపిస్తుంది. ఫైబర్ సహజంగా నీటిని ఎక్కువగా తీసుకుంటుంది. సలాడ్ తిన్న తరువాత దాహం ఎక్కువగా అనిపిస్తుంటుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే భోజనం చేసే సమయంలో మధ్యలో నీటిని తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ భోజనం చేసే ముందు లేదా మధ్యలో మీరు ఎలాంటి నీటిని తాగుతున్నారనేది చాలా ముఖ్యం. ఆల్కలిన్ వాటర్ తాగడం వల్ల పొట్టలోని ఆమ్లాలు మరింత తటస్థీకరించేలా చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ వంటి ఆమ్లాలు ఉన్న నీటిని సిప్ చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం చేసిన తరువాత నీళ్లు తాగడం, తాగకపోవడం అనేది శరీరం రకం మీద ఆధారపడి ఉంటుంది. అవసరం లేదనుకుంటే నీటిని కొద్దిసేపు ఆగిన తరువాత తాగడం మంచిది. కొంత మంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. దీంతో ఆ నీళ్లు నేరుగా బ్లాడర్‌లోకి వెళ్లిపోయి అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారని చెబుతారు. భోజనం మధ్యలో నీరు తాగకుండా ఉండడం మంచిది అనేందుకు సైంటిఫిక్ గా ఎలాంటి అధ్యయనాలు లేవు అని నిపుణులు చెబుతున్నారు.
Also Read : ల్యాప్ టాప్ స్క్రీన్ గీతలు, మరకలు ఉన్నాయా..? ఇలా చేస్తే అన్నీ మటుమాయం
నీళ్లు ఎప్పుడు తాగాలి ?
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ నీటిని తాగడం ఉత్తమం. శరీర అంతర్గత అవయవాలు పని చేయడంలో సహాయపడుతుంది. మీ మొదటి భోజనానికి ముందు నీళ్లుతాగడం వల్ల కడుపులో ఉన్న వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. అదేవిధంగా స్నానానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగితే మంచిది. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. కొంత మందికి వేడి నీటితో స్నానం చేసిన తరువాత నీళ్లు తాగాలని అనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. భోజనానికి ముందు లేదా తరువాత ఎక్కువగా నీళ్లు తాగకూడదు. ఎందుకు అంటే నీరు జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఆహారం తీసుకున్న ఒక గంట తరువాత వాటర్ తాగడం వల్ల శరీరం పోషకాలను గ్రహించేవిధంగా చేస్తుంది.
Also Read : అబ్బాయిల్లో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే 5 లక్షణాలు ఇవేనట….? 3 వది ఇంపార్టెంట్…!