Home » వాట్సాప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. మెసేజ్‌ను పొర‌పాటున డిలీట్ చేశారా..? ఇక త్వ‌ర‌లోనే..!

వాట్సాప్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. మెసేజ్‌ను పొర‌పాటున డిలీట్ చేశారా..? ఇక త్వ‌ర‌లోనే..!

by Anji
Ad

స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారంటే వారు క‌చ్చితంగా వాట్సాప్ వాడ‌కుండా ఉండ‌రు. ప్ర‌స్తుతం వాట్సాప్ వినియోగ‌దారులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. వాట్సాప్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వాట్సాప్‌న‌కు మ‌రొక కొత్త ఫీచ‌ర్ యాడ్ కానున్న‌ది. వ‌రుస కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌.. మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన టూల్‌ను టెస్ట్ చేస్తుంద‌ని స‌మాచారం. దీని ద్వారా కొత్త స‌దుపాయం రానున్న‌ది. ఒక‌వేళ వాట్సాప్ మెసేజ్‌ను పొర‌పాటున డిలీట్ చేస్తే మ‌ళ్లీ తిరిగి వ‌చ్చేవిధంగా చేస్తుంది. వాట్సాప్‌లో ఒక్కోసారి డిలీట్ ఫ‌ర్ ఎవ్రీ వ‌న్ ఆప్ష‌న్ ను ఎంచుకునే తొంద‌ర‌లో డిలీట్ ఫ‌ర్ మీ పై ట్యాప్ చేస్తుంటాం. అలాంటి స‌మ‌యంలో మ‌న‌కు మెసేజ్ డిలీట్ అవుతుంది. రిసీవ్ చేసుకున్న వారికి మాత్రం డిలీట్ అవ్వ‌దు. డిలీట్ చేసిన మెసేజ్ ఇక రాదు. త్వ‌ర‌లోనే ఆ మెసేజ్ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చే విధంగా వాట్సాప్ తీసుకురానున్న‌ది.

Advertisement

డిలీట్ చేసిన మెసేజ్‌ను వెంట‌నే మ‌ళ్లీ తిరిగి తెచ్చుకునే విధంగా అన్ డూ ఆప్ష‌న్ ను వాట్సాప్ తీసుకురానున్న‌ద‌ని వాట్సాప్ బీటా ట్రాక‌ర్ డ‌బ్ల్యూఏబీటాఇన్పో తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా వివ‌రించింది. దీని ప్ర‌కారం.. ఓ యూజ‌ర్ డిలీట్ ఫ‌ర్ మీ పై ప్రెస్ చేస్తే.. వెంట‌నే డిలీట్‌ను ఆన్ డూ చేయాలా లేదా అని పాప్ అప్ మెసేజ్ రానున్న‌ది. టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్స్‌లో ఇప్ప‌టికే ఇలాంటి అన్ డూ బ‌ట‌న్స్ ఉన్నాయి. టెలిగ్రామ్‌లో ఉన్న ఫార్మాట్ మాదిరిగానే వాట్సాప్ కూడా ఈ ఫీచ‌ర్ తెచ్చే అవ‌కాశం ఉంది. మెసేజ్ డిలీట్ చేసిన త‌రువాత అన్ డూ చేసేందుకు కాస్త స‌మ‌య‌మే ఉంటుంది.

Advertisement

డిట్ ఆప్ష‌న్‌ను కూడా వాట్సాప్ ప‌రీక్షీస్తోంది. మెసేజ్‌లో ఏదైనా త‌ప్పుంటే డిలీట్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా ఎడిట్ చేసి సరిదిద్దుకునే స‌దుపాయం ఈ ఫీచ‌ర్‌తో వ‌స్తుంది. మెసేజ్‌పై క్లిక్ చేసి హోల్డ్ చేసి మెనూలో ఎడిట్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకునేవిధంగా ఇది ఉండ‌నున్న‌ది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను WABetaInfo ఇటీవ‌ల వెల్ల‌డించింది. ఈ ఫీచ‌ర్ల‌ను వాట్సాప్ త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశ‌ముంది. ఆండ్రాయిడ్‌, ఓఐఎస్ వెర్ష‌న్‌ల‌కు ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇటీవ‌ల లాంచ్ చేసిన మెసేజ్ రియాక్ష‌న్‌ల‌కు కొత్త స‌దుపాయాన్ని వాట్సాప్ తీసుకురానున్న‌ది. ఎమోజీల‌ను విభిన్న స్కిన్ క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చేందుకు టెస్టింగ్ ప్రారంభించింది.

Also Read : 

ఇష్టంలేకున్నా గోపించంద్ ఎందుకు సినిమాల్లోకి వ‌చ్చాడో తెలుసా..? ఆయ‌న వెన‌కుంది ఎవరంటే..!

ఆ ఊరిలో సెల్‌ఫోన్, టీవీ, రేడియో నిషేదం.. ఎందుకో తెలుసా..?

 

Visitors Are Also Reading