Home » తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..డిసెంబ‌ర్‌ లోగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టింగ్‌లు

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..డిసెంబ‌ర్‌ లోగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టింగ్‌లు

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టింగ్ లకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 27వ తేదీ లోగా పోస్టింగులు ఇస్తే, దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 734, వైద్య విధానపరిషత్ లో 209, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 పోస్టులు భర్తీ చేస్తారు.

Advertisement

ఇప్పటికే ప్రకటించిన మెరిట్ లిస్ట్ ఆధారంగా, ఆయా విభాగాల వారిగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ లు కేటాయిస్తారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో రోజుకు 250 మంది చొప్పున కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం 3 రోజులపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వైద్య విధాన పరిషత్ పోస్టులకు ఒక్కరోజులోనే కౌన్సెలింగ్ పూర్తి చేస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగిస్తే, ఈ నెలాఖరులోగా 4,461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యచరణ ప్రారంభిస్తుంది.

Advertisement

అటు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో 4,661 స్టాప్ నర్సు పోస్టులకు నియామక ప్రకటన వెలువరించనుంది. ఈ నెలాఖరులోగా అంటే డిసెంబర్ 31 లోగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నర్స్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ప్రకటన అనంతరం పరీక్షకు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తారట.

READ ALSO : నిజంగా వెంకటేష్, రోజాల మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవా.. కారణం ఏంటి?

Visitors Are Also Reading