తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం తర్వాత హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ చాలా మంచి పాత్రలను పోషించి అభిమానులను ఆయన నటనతో మెప్పించారు. ముఖ్యంగా తాగుబోతు వేషాలకు ఈయన బ్రాండ్ అనే చెప్పవచ్చు. ఆ పాత్రల్లో మంచి నటనను చూపించి అందరిని నవ్వించారు. ఎమ్మెస్ నారాయణ దూకుడు, దుబాయ్ శీను సినిమాలలో ఫైర్ స్టార్ సల్మాన్ రాజుగా నటించి ఆడియన్స్ ను ఎంతో నవ్వించారు.
Advertisement
అయితే బ్రహ్మానందం మరియు ఎమ్మెస్ నారాయణ మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఎమ్మెస్ నారాయణ చివరి దశలో ఒక సంఘటన జరిగిందని దాని గురించి బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో వివరించడం జరిగింది. ఎప్పుడైతే అనారోగ్యం కారణంగా ఎమ్మెస్ నారాయణ హాస్పిటల్ లో చేరారో చివరి దశలో ఉన్నారని మరియు ఆయన చనిపోతారని తెలిసిపోయింది. మరో గంటలో చనిపోతాను అనగా తన కుమార్తెను పిలిచి ఒక పేపర్ అడిగారు.
Also read:
Advertisement
Also read:
ఆ పేపర్ పై బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని ఎమ్మెస్ నారాయణ రాశారట. దాంతో ఆమె బ్రహ్మానందం కి ఫోన్ చేసి విషయం చెప్పగా బ్రహ్మానందం హాస్పటల్ కి వెళ్ళారు. అప్పుడు ఎమ్మెస్ నారాయణ చేయి పట్టుకుని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంత మాత్రమే అర్థమవుతుంది, చేయి గట్టిగా పట్టుకుని అన్నయ్య అని పిలిచాడు. ఆ బాధని చూస్తూ ఉండలేక బయటికి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత 15 నిమిషాలు మాత్రమే ప్రాణం ఉంది అంటూ బ్రహ్మానందం ఎంతో బాధపడ్డారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!