Home » ఏడాదిలోపు పిల్లలు ఉన్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఏడాదిలోపు పిల్లలు ఉన్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

by Sravanthi Pandrala Pandrala

సాధారణంగా కొత్తగా పెళ్ళై, తల్లైన మహిళలు పిల్లల ఫుడ్ విషయంలో చాలా మధన పడుతుంటారు. సంవత్సరం లోపు పిల్లలకు ఏ ఆహారం పెట్టాలి? ఎలాంటి ఆహారం పెట్టకూడదో అవగాహన లేక అనేక ఇబ్బందుల పాలవుతుంటారు. కొంతమంది మహిళలు పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటారు.. మరి సాధారణంగా ఏడాదిలోపు పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి? ఎలాంటి ఆహారం పెట్టకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ALSO READ;తప్పు చేశానమ్మా.. నన్ను క్షమించండి.. మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడిన వ్యక్తి

పిల్లలు పాలు మానేసి ఇప్పుడిప్పుడే ఆహారానికి అలవాటు పడుతున్న సమయంలో చాలామంది తల్లులు ఉగ్గులాంటి ఆహారపార్థాలను పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మెత్తటి పదార్థాలను కూడా తినిపిస్తూ ఉంటారు. కానీ ఏడాదిలోపు పిల్లలకు కొన్ని కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని పిల్లల వైద్యులు అంటున్నారు .. మరి ఆ పదార్థాలు ఏంటో చూసేద్దాం.. ఏడాదిలోపు పిల్లలకు చాలామంది తల్లులు పండ్ల రసాలను తాగిస్తూ ఉంటారు .. దీనివల్ల పిల్లలు డయేరియాకు గురయ్యే అవకాశం ఉంది..

అందుకే పిల్లలకు పండ్ల రసాలు పెట్టకూడదని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఏడాదిలోపు పిల్లలకు వేరుశనగలను కూడా పెట్టరాదట. దీనివల్ల కొంతమంది పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉందట . కాబట్టి పిల్లల ఆహార పదార్థాలు ఈ ఆహారాన్ని దూరంగా ఉంచండి. అంతేకాదు ఏడాదిలో పిల్లలకు పొరపాటున కూడా చాక్లెట్లను ఇవ్వకూడదట , ఇందులో ఉండే కెఫిన్ పిల్లల ఆరోగ్యాన్ని వారి ఎదుగుదలను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు.. ఇవే కాకుండా స్వీట్స్,పంచదార, తేనె,దుంప జాతి కూరగాయలను కూడా పెట్టకూడదని అంటున్నారు. ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థకు దెబ్బ తినే అవకాశం ఉందని పిల్లల వైద్య నిపుణులు అంటున్నారు.

ALSO READ;రేటు పెంచేసిన ధమాకా బ్యూటీ…! ఒక్క సినిమాకే అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా..?

Visitors Are Also Reading