నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఇక సినిమా ప్రమోషన్‌లలో భాగంగా నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి హీరో ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన అన్న నందమూరి కల్యాణ్ రామ్ కోసం హాజరైన ఎన్టీఆర్ సినిమా ఐ అంచనాలు భారీగా పెంచేవిధంగా తన స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా మాది.. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Advertisement
బింబిసార సినిమాతో నందమూరి కల్యాణ్ రామ్ వెనుతిరి చూసుకోవాల్సిన అవసరం లేదంటూ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్ ఒక ఎత్తయితే బింబిసార సినిమా తరువాత ఆయన కెరీర్ మరో ఎత్తు అన్నట్టు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగే విధంగా చేసింది. ఎన్టీఆర్ ఎక్కువగా మాట్లాడాడనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. కల్యాణ్ రామ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండదు.
Advertisement
ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాను ఒకసారి చూద్దాం అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల మనసులో అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఈ సినిమాకు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో మరి. ఈ సినిమా ఎలా ఉంటుందనేది వచ్చే వారంలో తెలియనుంది. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
Also Read :
రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్ గురించి అనన్య ఏమందో తెలుసా..?