తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే బాలకృష్ణ,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరికి మాత్రమే నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అలాంటి నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం హీరోగా అనేక ప్రయత్నాలు చేశారు కానీ విఫలమయ్యారు. ఆయన కు సినిమా ఇండస్ట్రీ కలిసి రాలేదు. దీంతో అనేక ఇబ్బందులు రాజకీయాల్లో అయిన రానిద్దామని నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం అనే పాదయాత్రలో పాల్గొని గుండెపోటు గురై నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులు చికిత్స పొంది చివరికి కన్నుమూశారు.
also read:మీ ఆశీస్సులతోనే మౌనికతో పెళ్లి…మొదటిసారి స్పందించిన మనోజ్..!
Advertisement
దీంతో తారకరత్న గురించి అనేక వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. తారక రత్న బతికున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా హాని చేయలేదట. ఎవరితోనైనా చాలా ఆత్మీయంగా మాట్లాడేవారని అలాంటి నందమూరి హీరో చిన్న వయసులోనే మరణించడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి తారకరత్న జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యా భవన్ లో హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తారకరత్నకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.
Advertisement
also read:షారూఖ్ ఖాన్ సినిమాలో రామ్ చరణ్.. ఆ పాత్రలో ?
అలాగే స్నేహితులతో గడపడం కూడా ఇష్టమట. అలా తారకరత్న ఇంజనీరింగ్ చదువుతున్న టైం లోనే 2002 ఏడాదిలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒకేసారి 9 చిత్రాలను ఓకే చేసుకొని ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేశారు. ఆయన మొదటిసారి హీరోగా చేసిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా అంతగా హిట్ అవకపోవడం తో సినిమాలలో ఆయన రాణించలేకపోయారు. అలాంటి తారకరత్న ఈ మూవీకి మొదటిసారి 10 లక్షల పారితోషకం తీసుకున్నట్టు అశ్విని దత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read: