నటసింహం నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన దర్శకుడు గోపిచంద్ మలినేని. ఆయన తరువాత సినిమా కోసం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. చెన్నైకి వెళ్లి మరీ ఈ దర్శకుడు ఆయనకు కథ వినిపించగా.. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు కానీ తరువాత ఈ న్యూస్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు.
Advertisement
గోపిచంద్ మలినేని కథ చెప్పిన వచ్చిన కొద్ది రోజుల్లోనే దళపతి విజయ్ ఇటీవలే నాగచైతన్య హీరోగా కస్టడీ సినిమా తీసిన దర్శకుడు వెంకట్ ప్రభు కలిసి ఆయన సినిమా చేయబోతున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. దీంతో గోపిచంద్ మలినేనితో విజయ్ ఈ సినిమా చేయడం లేదని.. కన్ఫామ్ అయిపోయింది. కానీ విజయ్ ఈ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు. కొద్దిసేపటికీ గోపిచంద్ మలినేని, మైత్రి మూవీస్ బ్యానర్ లో రవితేజతో సినిమా చేస్తున్నాడని అఫిషియల్ గా ఎనౌన్స్ మెంట్ రాగా.. దర్శకుడు గోపిచంద్ మలినేని దళపతి విజయ్ రిజెక్ట్ చేసిన కథనే రవితేజ చేస్తున్నాడా..? లేక కొత్త కథనా..?
Advertisement
అసలు విజయ్ కథను ఎందుకు రిజెక్ట్ చేశాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి.అయితే నిజమేంటనే.. దళపతి విజయ్ త్వరలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేవిధంగా ఉండే సినిమాలు చేయాలని చూస్తున్నారట. అందుకే మాస్ మూవీ కాకుండా ఆయన గతంలో నటించిన కత్తి, సర్కార్ లాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించాలనుకుండటంతో గోపిచంద్ మలినేని కథను విజయ్ రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భోళాశంకర్ ప్రోమోకి రెస్పాన్స్ మామూలుగా లేదుగా.. మరీ సాంగ్ కి ఏ రేంజ్ లో ఉంటుందో ?