దేశ విభజన తరువాత పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమక్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం 22 లక్షల మంది హిందువులు ఉన్నట్టు గణాంకాలు తాజాగా వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68లక్షలుగా ఉంది. వారిలో మైనారిటీ హిందువుల జనాభా 1.18 శాతం ఉన్నట్టు సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ పేర్కొన్నది. నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ డేటా ప్రకారం.. పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనారిటీల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువనే. వారిలో మైనార్టీ హిందువులు అత్యధికంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
Advertisement
ఇక ఎన్ఐడీఆర్ఏ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లో 18కోట్ల 68లక్షల జనాభా ఉండగా.. వారిలో 18కోట్ల 25లక్షల మంది ముస్లింలే ఉన్నారు. అక్కడ నివసిస్తోన్న వారి మతాలు, విశ్వాసాల ఆధారంగా మైనార్టీల సంఖ్యల అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 22లక్షల 10వేల (22,10,566) మంది హిందువులు ఉండగా.. 18, 73,348 మంది క్రైస్తవ జనాభా ఉన్నట్టు తేలింది. అహ్మదీలు లక్ష88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్ 14వేలో పాటు మరో 3917 మంది పార్సీలు ఉన్నట్టు వెల్లడించింది. రెండువేల కంటే తక్కువ జనాభా కలిగిన మైనార్టీ వర్గాలు పాకిస్తాన్‌లో 11 ఉన్నట్టు గుర్తించింది.
Advertisement
బౌద్ధమతస్తులు 1787, చైనీయులు 1151, ఆఫ్రికన్ మతాలకు చెందిన వారు 1418 మందితో పాటు వందల సంఖ్యలో ఇతర వర్గాలు వారు ఉన్నట్టు ఎన్ఐడీఆర్ఏ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. 2 శాతం కంటే తక్కువగా ఉన్న హిందువులతో పాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువ అయినట్టు నివేదికలు వెల్లడిస్తున్న విషయం విధితమే. ఇక మైనార్టీలుగా ఉన్న వారిలో దాదాపు 95 శాతం మంది సింధ్ ప్రావిన్స్‌లోనే జీవిస్తున్నారు. మరొకవైపు పాకిస్తాన్ చట్టసభల్లో మైనార్టీ వర్గాల ప్రాతినిథ్యం కూడా లేదనే చెప్పొచ్చు.
Also Read :
నయనతార పెళ్లిపై రోజా ఏమన్నారో తెలుసా..?
చిలుక జోస్యానికి కరీంనగర్ జిల్లాలోని ఆ గ్రామం చాలా ఫేమస్.. అది ఏ ఊరు అంటే..?