Home » పెళ్ళంటే ఏమిటి..? ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన 3rd క్లాస్ బాలిక..ఆ ఒక్క ట్విస్టు మాత్రం భలే ఉందిగా..!

పెళ్ళంటే ఏమిటి..? ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన 3rd క్లాస్ బాలిక..ఆ ఒక్క ట్విస్టు మాత్రం భలే ఉందిగా..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో ఎలాంటి చిన్న విషయమైనా కాస్త ఆసక్తికరంగా ఉంటే చాలు సోషల్ మీడియాలో పెట్టేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దానిపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తూ ఒక ఆట ఆడేసుకుంటారు. అలా ప్రతి చిన్న విషయం ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అలాంటి ఒక విషయం ఇప్పుడు చూద్దాం.. మూడో తరగతి బాలిక ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తిగా మారింది. దాన్ని పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారిపోయింది. అదేంటో పూర్తి వివరాలు చూద్దాం.. పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు.. వారు తప్పు చేసినా కానీ తప్పు పట్టకూడదు..

Advertisement

also read:ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియాలో వైరల్

అయితే తాజాగా ఈ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ సంఘటన చూస్తే మాత్రం పిల్లల మనస్తత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడో తరగతి చదువుతున్న ఒక బాలిక పరీక్ష పేపర్ లో వచ్చిన ప్రశ్నకు విచిత్రమైన సమాధానమిచ్చింది.. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే.. పెళ్ళంటే ఏమిటి..? అనేక ప్రశ్నకు ఇలా సమాధానం రాసింది.. ఈ ఆన్సర్ ను వేలు అని ట్విట్టర్ యూజర్ షేర్ చేయడంతో ఇది కాస్త నెటిజన్లకు ఆసక్తికరంగా మారింది. ఆమె ఏం రాసింది అంటే.. అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో.. నువ్వు పెద్ద దానివి అయ్యావు.. ఇక నీకు తిండి పెట్టలేము.. నువ్వు ఒక మగవాడిని వెతుక్కో.. ఆ వ్యక్తి నీకు కడుపునిండా తిండి పెడతాడని చెబుతారట.. ఈ క్రమంలోనే అమ్మాయి ఆ యువకుడిని కలుస్తుంది.. కానీ వారి తల్లిదండ్రులు వారికి పెళ్లి చేసేందుకు గొడవ చేస్తారు..

Advertisement

దీంతో ఆ అమ్మాయి అబ్బాయి మేమిద్దరం పెద్దవాళ్ళమయ్యం.. ఇద్దరం కలిసి ఉంటామని చెప్పి వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక దగ్గరే జీవిస్తారు.. దీని తర్వాత పిల్లల కోసం ” నాన్సెన్స్” చేస్తారని రాసింది.. ఈ సమాధానం చూసిన టీచర్ కు దిమ్మతిరిగింది.. అది నచ్చక 10 మార్కులు ఉన్న క్వశ్చన్ కు సున్నా మార్కులు వేసి, దీనిపై టీచర్ నాన్సెన్స్ అని రాసినట్టు కనిపిస్తోంది.. అయితే ఈ జవాబును చూసిన నెటిజన్లు అమ్మాయిని తెగ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading