తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ అనగానే ఎవరైనా సుడిగాలి సుధీర్ పేరు చెబుతుంటారు. జబర్దస్త్‌తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో సుధీర్ చేసిన సందడి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతని కామెడీ టైమింగ్స్.. ఇన్నోసెంట్ లుక్స్ ఇంకా రొమాన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయనను సూపర్ స్టార్ చేసాయనడంలో సందేహం లేదు. సూపర్ స్టార్ కాస్త ఇప్పుడు ఈటీవీ మల్లెమాల వారికి దూరమై స్టార్ మా వైపు అడుగువేశారు. అక్కడ కూడా సుధీర్‌కు మంచి హోదాతో పాటు పారితోషికం కూడా దక్కింది.
Advertisement
ఇక సుధీర్ చాలా హ్యాపీగా వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన వదిలి వేసి వెళ్లిపోయిన జబర్దస్త్, శ్రీదేవిడ్రామా కంపెనీల పరిస్థితి ఏమిటనేది అందరికీ అర్థమవుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌లో సుధీర్ లేకపోవడంతో రామ్‌ప్రసాద్ సొంతంగా స్కిట్లు చేస్తున్నాడు. సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకుని రామ్ ప్రసాద్ నెట్టుకొస్తున్నాడు.సుధీర్ లేని లోటు కచ్చితంగా రామ్‌ప్రసాద్ టీమ్‌లో కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ పరిస్థితి ఇంత దారుణం. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్‌గా సుధీర్ కాకుండా మరెవ్వరూ వచ్చినా కూడా ఓ ఆట ఆడేసుకునే వారు.
Advertisement
అందుకే ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా ముద్రపడిన రష్మి గౌతమ్‌ను తీసుకువచ్చారు. తాజాగా తొలి ఎపిసోడ్ టెలిక్యాస్ట్ అయింది. సుధీర్ లేని లోటు వందకు రెండు వందల శాతం కనిపించింది. ఆ విషయాన్ని స్వయంగా రామ్‌ప్రసాద్, హైపర్ ఆదిలు చెప్పుకొచ్చారు. రష్మి తెలుగు మాట్లాడడం కోసం ఎంత కష్టపడుతుందో తెలిసినదే. అలాంటి రష్మి జబర్దస్త్‌ను ఏదో విధంగా నెట్టుకొస్తుంది. ఇలాంటి సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ బాధ్యత కూడా ఆమెకు అప్పగిస్తే కచ్చితంగా కష్టమే అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.