Home » లాన్ బౌల్స్ లో టీం ఇండియా గోల్డ్.. ఈ గేమ్ ఎలా ఆడుతారో తెలుసా..?

లాన్ బౌల్స్ లో టీం ఇండియా గోల్డ్.. ఈ గేమ్ ఎలా ఆడుతారో తెలుసా..?

by Azhar
Ad

ప్రస్తుతం ఒలంపిక్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే మన దేశంలో కేవలం క్రికెట్ నే ఎక్కువ మంది చూస్తారు. కానీ ఇలాంటి గేమ్స్ అనేవి జరిగినప్పుడు మనకు చాలా గేమ్స్ అనేవి కొత్తగా కనిపిస్తాయి. అయితే ఈరోజు మన భారత జట్టు అనేది కామన్వెల్త్ లో లాన్ బౌల్స్ అనే గేమ్ లో మహిళలు గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాను 17-10 తో ఓడించింది.

Advertisement

అయితే ఈ లాన్ బౌల్స్ అనే గేమ్ లో డబల్ అండ్ టీం గేమ్ ఉంటుంది. టీం గేమ్ లో నాలుగు ఆడుతారు. ఈరోజు మనం ఈ టీం గేమ్ లోనే గోల్డ్ అనేది గెలిచాం. అయితే ఈ లాన్ బౌల్స్ లో మొత్తం 18 రౌండ్స్ ఉంటాయి. టీం గేమ్ లో ప్రతో రౌండ్ లో 8 బాల్స్ అనేవి రెండు జట్లకు ఉంటాయి. ఇక గ్రౌండ్ లో ప్లేయర్స్ కు దూరంగా జాక్ అంటే ఎల్లో కలర్ లో ఓ బంతిని ఉంచుతారు.

Advertisement

ఇక టీం లోని ప్రతి ప్లేయర్ రెండు సార్లు బంతిని ఈ జాక్ వైపు విసరాలి. అలా మొత్తం రెండు జట్లలోని నాలుగు ప్లేయర్స్ 8 బంతులను విసిరిన తర్వాత ఆ ఎల్లో బల్ కు ఏ జట్టు యొక్క బంతి అనేది అతి దగ్గరగా ఉందొ చూస్తారు. అయితే ప్రత్యర్థి జట్టు యొక్క బాల్ ఈ ఎల్లో బాల్ కు దగ్గర ఉందొ.. చూసి ఆ బాల్ కంటే మన జట్టు యొక్క ఎన్ని బాల్స్ అనేవి ఈ ఎల్లో బాల్ అంటే జాక్ కు దగ్గరగా ఉంటె అన్ని పిన్స్ అనేవి వస్తాయి. ఇలా ప్రతి రౌండ్ లో 8 బాల్స్ అనేవి ముగిసిన తర్వాత ఎవరు లిడ్ లో ఉంటె వారే విన్నర్.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల.. మొదటే భారత్, పాక్ పోరు..!

టెస్ట్ అని చెప్పి చిక్కులో పడిన రోహిత్…!

Visitors Are Also Reading