Home » ఇండియా సెమీస్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఏం అవుతుంది..?

ఇండియా సెమీస్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఏం అవుతుంది..?

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో రేపు పాకిస్థాన్, కివీస్ తలపుతుండగా.. ఈ నెల 10న ఇండియా, ఇంగ్లాండ్ జట్లు మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ ప్రపంచ కప్ లో వర్షం ఎలాంటి రోల్ పోషిస్తుందో అందరికి తెలిసిందే.

Advertisement

సూపర్12 మ్యాచ్ లలో వేషం కారణంగా కీలక జట్ల మధ్య మ్యాచ్ ఆగిపోయింది. దాంతో సెమీస్ లేఖలు మొత్తం మారిపోయాయి. దాంతో ఒకవేళ సెమీస్ మ్యాచ్ లలో కూడా వర్షం పడితే ఏంటి పరిస్థితి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే సూపర్ 12 మ్యాచ్ కు రిజర్వ్ డే అనేది లేదు. కానీ సెమీస్ మ్యాచ్ లకు రిజర్వ్ డే అనేది ఉంది. అంటే అనుకున్న రోజు మ్యాచ్ వర్షం వల్ల జరగకపోతే మరుసటి రోజు దానిని నిర్వహిస్తారు.

Advertisement

ఒకవేళ అనుకున్న రోజుతో పాటుగా రిజర్వ్ డే రోజు కూడా వర్షం మ్యాచ్ ను జరగనివ్వకపోతే మాత్రం.. అప్పుడు ఐసీసీ సూపర్ 12 పాయింట్ల పట్టికను ముందుకు తెస్తుంది. అందులో ఈ జట్టు ఎక్కువ పాయింట్లు, నెట్ రన్ రేట్ తో ఉంది అని గమనించి వారిని విజేతగా ప్రకటించి ఫైనల్స్ చేరుస్తుంది. అంటే రెండు సెమీస్ మ్యాచ్ లు క్యాన్సిల్ అయితే మొదట న్యూజిలాండ్.. రెండో మ్యాచ్ నుండి ఇండియా జట్లు ఫైనల్స్ కు వెళ్తాయి.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కు గాయం.. సెమీస్ ఆడుతాడా.. లేదా..?

ఐపీఎల్ లో ఇంకా జట్లు పెరగనున్నాయా..?

Visitors Are Also Reading