సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలంటే చాలా కండిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయి, అబ్బాయి జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్లి సమయంలో చాలా నిబంధనలు పాటిస్తుంటారు. ఇక మూల నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని అని చెబుతుంటారు. వాస్తవానికి మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని చెబుతుంటారు. మూల నక్షత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : ప్రతిరోజూ ఈ పండ్లు తింటే ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు..!
Advertisement
శాస్త్ర పరంగా చూసుకున్నట్టయితే మూల నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకుంటే అదృష్ట వంతుడు అని శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొంత మంది బయట తెలిసి తెలియక మూల నక్షత్రంలో చేసుకున్న వారి ఇంట్లో అలా జరిగిందని లేనిపోని అపోహలు పుట్టిస్తూ ఉంటారు. ఒకవేళ వారు అనుకున్నట్టే జరిగి ఉంటే ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి పుట్టగానే వారి కుటుంబానికి ఏదో ఒకటి జరగాలి. లేదంటే ఆమె చదువు సంధ్య ఏది చదువు సంధ్య ఏది లేకుండా అనేక ఇబ్బందుల పాలు కావాలి. కానీ ఎందుకు కాలేదు. నక్షత్రంలో పుట్టిన కొంత మంది అమ్మాయిలు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు వారికి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. మూల నక్షత్రంలో వారు పుట్టడం వల్ల ఎవ్వరికీ సమస్య వచ్చింది. పెళ్లి చేసుకుంటే సమస్య ఎందుకు వస్తుంది అనే విషయాలను ఆలోచించుకోవాలి.
Advertisement
అనవసరమైన రాద్దాంతాన్ని క్రియేట్ చేసి పెట్టడం వల్ల చాలా మంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకుండా లేనిపోని అపోహలు నమ్ముతున్నారని కొంత మంది శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. కచ్చితంగా చెప్పాలంటే మూల, ఆరుద్ర, జేష్ట నక్షత్రాల్లో కలిసి మొత్తం 27 నక్షత్రాలున్నాయి. కొంత మంది చెప్పిన దాని ప్రకారమే మూడు నక్షత్రాలు కలిగిన వారిని పెళ్లి చేసుకుంటే నష్టం వస్తుందని భావిస్తారు. ఇంకా 24 నక్షత్రాల్లో పెళ్లి చేసుకున్న వారందరూ సుఖంగా ఉంటున్నారా ? వారికి ఏ సమస్యలు రావడం లేదా? అనేది మనం చూసుకోవాలి. అనవసర రాద్దాంతం మనిషికి ప్రశాంతత కష్టపడే గుణం ఉంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారి జీవనం బాగానే ఉంటుందనేది కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు.