వివాహం చేసుకోవాలంటే మొట్టమొదట జాతకాలని చూస్తారు. జాతకాలు మ్యాచ్ అయితే ఆ తర్వాత పెళ్లి చేయడానికి పెద్దలు ఒప్పుకుంటారు. అయితే కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా..? ఒకవేళ కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. కుజ దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది పండితులు చెప్పడం జరిగింది. జాతకాలు చూసినప్పుడు వరుడు వధువు ఇద్దరి జాతకంలో కుజదోషం ఉందా లేదా అనేది పండితులు మొట్టమొదట చూస్తారు. పాయింట్లు లెక్కన వరుడుకి వధువుకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూస్తారు పండితులు.
Advertisement
Advertisement
ఆయుర్దాయాన్ని మొదట పండితులు చూస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఏం జరుగుతుంది అంటే బలాబలాలు చూస్తారు. అయితే కుజదోషం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే చూస్తారు. మగవాళ్ళకి కుజదోషం వర్తించదు. వివాహ సమయంలో ఆడవాళ్ళకి కుజుడుని మగవాళ్ళకి శుక్రుడిని పరిగణలోకి తీసుకుంటారు. కుజ దోషానికి అనేక పరిష్కారాలు కూడా ఉన్నాయి. అయితే కుజ గ్రహం శుభస్థానాల్లో ఉండే వాళ్ల జీవితం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. కుజదోషం ఉన్న జాతకాలు, వారి కుజ దోషము ఉన్న స్థానాన్ని బట్టి, వయసును బట్టి దోష ప్రభావం ఉంటుంది. కుజదోషం ఉన్న జాతకులు వివాహం తర్వాత జీవితంలో సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాలి. విడాకులు లేదంటే రెండు మూడు పెళ్లిళ్లు వంటివి ఎక్కువగా వీళ్ళకి ఉంటాయి.
Also read:
- సీతాఫలం తింటే జలుబు, దగ్గు వస్తాయా..? ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే..?
- వినాయక చవితి నాడు పూజ చేస్తున్నారా..? అయితే ఇలాంటి వినాయకుడుని పెట్టుకోండి..!
- చాణక్య నీతి: భర్తకి ఈ విషయాల్లో సపోర్ట్ ఇస్తే.. భార్య బతుకు బస్టాండే…!