Home » తులసి చెట్టులో వచ్చే ఈ మార్పు గమనించారా ? ఇది వీటికి సంకేతం అని మీకు తెలుసా ?

తులసి చెట్టులో వచ్చే ఈ మార్పు గమనించారా ? ఇది వీటికి సంకేతం అని మీకు తెలుసా ?

by AJAY
Published: Last Updated on
Ad

హిందూ సాంప్రదాయాలను పాటించే ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి. ఇంట్లో దేవుళ్ళ చిత్ర పటాలు ఎంత ముఖ్యమో ప్రతి ఇంట్లో తులసి మొక్క కూడా అంత ముఖ్యం అవుతుంది.

Advertisement

ఇక తులసిలో రెండు రకాలు ఉంటాయి. ఎరుపు రంగులో కాండం ఉండే తులసిని రామ తులసి అని అంటారు. కాండం నలుపు రంగులో ఉండే తులసి మొక్కలను కృష్ణ తులసి అంటారు. కేవలం తులసి తో అధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Advertisement

ముఖ్యంగా జలుబు, దగ్గు నివారణలో తులసిని ఉపయోగిస్తుంటారు. ఇంటికి ఎంతో మంచి చేసే తులసిలో కూడా కొన్ని సార్లు మార్పులు వస్తుంటాయి. తులసి మొక్కలు అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. అయితే తులసి మొక్క ఉన్న తీరు బట్టి కుటుంబం లో మార్పులు వస్తాయట. తులసి మొక్క ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో సంతోషం ఉంటుందట.

 

ఎలాంటి అపాయం లేకుండా ఆనందం, ఆరోగ్యం తో పాటు ఆదాయం కూడా ఉంటుందట. కానీ తులసి మొక్క వాడిపోయిన చెట్టు ఆకులు ఎండిపోయిన కుటుంబంలో సమస్యలు మొదలవుతాయట. కొన్ని సార్లు చేత బడి చేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న తులసి ఎండిపోతుందట అలా ఎండిపోయిన సమయంలో కుటుంబం లోని వ్యక్తులు అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉందట. కాబట్టి తులసి మొక్కకు పూజ చేసే సమయంలో ప్రతి రోజూ దానిని జాగ్రత్తగా పరీక్షించాలని చెబుతున్నారు.

Also Read: ప్ర‌భాస్ ఈవెంట్ కోసం న‌వీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నారో తెలుసా..?

Visitors Are Also Reading