ప్రస్తుతం భారతదేశ సినిమా అంతా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చుట్టూనే తిరుగుతోంది. రాజమౌళి పేరు ఎక్కడ చూసినా మారు మ్రోగిపోతుంది. రాజమౌళికి ఇంత గొప్ప పేరు ఒకటి రెండేండ్లలోనో లేదా ఒకటి రెండు సినిమాలకు రాలేదు. 20 ఏళ్ల గొప్ప కష్టం. దీని వెనుక దాగి ఉన్నది. సింహాద్రి సినిమాతో తానేమిటో రాజమౌళి ప్రూవ్ చేసుకున్నాడు. మగధీర విజయం రాజమౌళిని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది. బాహుబళి విజయాలు దేశ శిఖరాగ్రాన కూర్చొపెట్టేశాయి.
ఆర్ఆర్ఆర్ విడుదలవుతున్న వేళ రాజమౌళి గత సినిమాలకు సంబంధించిన ఇంట్రస్టింగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా మగధీర 2010లో వచ్చిన సినిమా రామ్ చరణ్‌కు ఒక్కసారిగా తిరుగులేని ఇమేజ్ తీసుకురావడంతో పాటు మనోడిని ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసేసింది. అసలు సినిమా దెబ్బతో చరణ్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు.
Advertisement
ఇప్పుడు ఇంత స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అంటే అందుకు కారణం మగధీరతో రాజమౌళి వేసిన బలమైన పునాదే. ఇక మగధీర చరణ్‌కు రెండవ సినిమా. అంతకుముందు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే సినిమా చేశాడు. ఆ సినిమా 43 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది. ఆ తరువాత మగధీర కోసం ఓవరాల్‌గా నాలుగేళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాను రాజమౌళి ఏకంగా రెండేళ్ల పాటు శిల్పం చెక్కినట్టు చెక్కేశాడు.
Advertisement
ఈ సినిమా విడుదల ముందు రోజు మెగాస్టార్ ఇంట్లో ఏమి జరిగిందో చిరుయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముందు రోజు రాత్రి సినిమా వాళ్లకు ఆ సినిమా యూనిట్‌కు రెండ చోట్ల ప్రివ్యూలు వేశారట. ముందుగా చిరు ఆయన సతీమణి సురేఖ ఓ థియేటర్ లో ప్రివ్యూ షోకు వెళ్లారట. ఈ సినిమా కథేంటి అన్నది చిరుకు ముందుగానే తెలుసు. విజువల్‌గా ఎలా ఉంటుందో అన్న చిన్న సందేహం ఉందట. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ విజువల్స్ తన ఊహకే అందనివిధంగా ఉన్నాయని సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగిందని చెప్పారు.
సినిమా పూర్తయ్యాక చరణ్ అక్కడ లేడట. మరొక థియేటర్‌లో ప్రివ్యూ నడుస్తుండడంతో అక్కడకు వెళ్లాల్సి వచ్చిందట. సినిమా చూసి ఒకింత ఆనందం.. ఒకింత భావోద్వేగం.. ఒకింత సంతోషంతో తన తనయుడిని వాటేసుకోవాలన్న సురేఖ కోరిక తీరకపోవడంతో ఆమె అసంతృప్తికి లోనయ్యారని చిరు చెప్పారు. ఇంత చిన్న వయస్సులో ఇంత పెద్ద క్యారెక్టర్ వేయడం ఏమిటి..? ఇంత పెద్ద రిస్క్‌లు ఏమిటని తనకు, సురేఖకు ఇద్దరికీ చాలా భయం వేయడంతో పాటు ఒకింత ఆనందం కూడా కలిగిందని చిరు తెలిపారు.
ఇక ఫస్ట్ షో ముగించుకుని ఇంటికి వచ్చాక రాత్రి 9.40 అయిందట. దాదాపు అరగంట పాటు ఆ సినిమా గురించే చర్చించిన తరువాత మళ్లీ సినిమాకు వెళ్లదాం అని రిక్వెస్ట్ చేయడంతో చిరు షాక్ అయ్యారట. ఇన్నేళ్ల నా జీవితంలో కనీసం నా సినిమాను కూడా ఎప్పుడు రెండవ సారి చూడాలని అడగలేదు. అంతేలే నీకు ఎంతైనా నా కంటే నీ కొడుకు ముద్దు అని చెప్పిన చిరు మళ్లీ మరొక థియేటర్‌లో ప్రివ్యూ జరుగుతుండగా.. సురేఖను ఆ షోకు తీసుకువెళ్లారట. ఇక ఇంటర్వెల్ టైం నుంచి ఆ షో చూసి అక్కడే ఉన్న చరణ్ ను ముద్దాడి ఎంతో ఆనందపడ్డారట. సినిమా చూసి ఇంటికి వచ్చే సరికి 1గంట అయిందట.. ఆ రోజు అంతా సురేఖ చాలా సేపు చర్చించిందట. ఆ రోజు తమకు నిద్ర పట్టలేదని చిరంజీవి చెప్పారు.
Also Read : ‘నువ్ నాకు నచ్చావ్’ లాంటి బ్లాక్ బస్టర్ వదులుకొని కెరీర్ పోగొట్టుకున్న హీరో ఎవరంటే ?