సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యంతో పాటూ డబ్బు కూడా అవసరమే. డబ్బు లేదంటే ప్రస్తుతం సమాజంలో విలువ కూడా ఇవ్వడం లేదు. అంతే కాకుండా ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకూ ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అయితే డబ్బు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి డబ్బు ఊరికే వస్తే ఎవరు కాదంటారు.
Advertisement
అందుకే ఎక్కడ రూపాయి దొరికినా టక్కున జేబులో వేసుకుంటారు. అయితే అలా దొరికిన డబ్బును తీసుకోకూడదని అలా తీసుకుంటే దానికి రెండింతలు మన జేబు నుండి పోగొట్టుకోవాల్సి వస్తుందని చెబుతుంటారు. అయితే అలా నిజంగానే జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం…నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారంగా డబ్బు దొరికింది అంటే అది మంచికి సంకేతం.
Advertisement
అంతే కాకుండా డబ్బు దొరికింది అంటే వాస్తు శాస్త్రం ప్రకారంగా అది పూర్వీకుల ఆశీర్వాదంగా భావించాలి. డబ్బు దొరికిన తరవాత జీవితంలో కష్టాలు వస్తాయని రెండింతల డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పేదానిలో ఎలాంటి నిజాలు లేవని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అంతే కాకుండా అలా దొరికిన డబ్బును సరైన మార్గంలో ఖర్చు పెడితే జీవితంలో ఆర్థికంగా మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే అలా దొరికిన డబ్బును ఎవరైనా పడేసుకున్నారా…? ఏవైనా అని చూసి అక్కడ ఎవరూ లేనట్టయితే తీసుకోవాలట. అంతే కాకుండా డబ్బుతో పాటూ ఐవైనా ఆధారాలు ఉంటే వారికే ఇవ్వాలట. ఎందుకంటే తెలిసి చేయడం వల్ల అది తప్పు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ALSO READ : Rishabh Pant:కర్రలతో రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్