ఝాన్సీరాణి లక్ష్మీబాయి అంటే మనకు గుర్తొచ్చే రూపం చేతిలో కత్తి… గుర్రం పై కూర్చున్న వీర వనిత ఆమె వెనకాల బాలుడు. అయితే ఝాన్సీ రాణి ఎత్తుకున్న బాలుడు ఎవరన్న అనుమానం మాత్రం చాలా మందికి ఉంటుంది. ఆ బాలుడి పేరు దామోదరరావు.. 1949లో జన్మించిన ఆ బాలుడిని మూడేళ్ళ వయసులో ఝాన్సీ రాణి- మహారాజు గంగాధరరావు దత్తత తీసుకున్నారు. ఈ విషయమై వారసుడిగా అంగీకరించాలని ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి కి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఆమోదం లభించేలోగానే గంగాధరరావు మరణించారు. దాంతో రాణి లక్ష్మీ బాయి తన కొడుకుని గుర్తించాలంటూ కోల్కతాలోని గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కి లేఖ కూడా రాశారు.
అయితే అప్పట్లో వారసులు లేకుండా రాజు మరణిస్తే ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు. దాంతో లక్ష్మీ బాయి దరఖాస్తులను తిరస్కరించారు. రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా ఝాన్సీరాణి కి ఆఫర్ కూడా ఇచ్చారు. రాజీ పడి రాజ్యాన్ని తమకు అప్పగిస్తే ప్రతి ఏడాది ఐదువేల ఫించన్, వ్యక్తిగత ఆస్తులను ఇస్తామన్నారు. అంతేకాకుండా ఖజానా లోని ఏడు లక్షల నగదును పిల్లవాడు పెద్దయ్యాక అప్పగిస్తామని చెప్పారు. కానీ ఝాన్సీ రాణి యుద్ధానికి దిగింది. కానీ గ్వాలియర్ లోని వంచకుడు నమ్మకద్రోహం చేయడంతో వీరమరణం పొందింది.
Advertisement
Advertisement
అయితే యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన 9ఏళ్ల దామోదర రావును ఝాన్సీ రాణి నమ్మినబంట్లు కాపాడారు. అతడిని బుందేల్ ఖండ్ లోని ఓ రహస్య అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అడవిలో పండ్లు ఫలాలు తప్ప తినడానికి మరేమీ దొరికేది కాదు. ఈ క్రమంలో బాలుడు ఓసారి అనారోగ్యం బారిన పడ్డాడు. అటవీ సమీప గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రిటిష్ గూడాచారులే ఉండేవారు. కానీ అనారోగ్యం బారిన పడటంతో గ్వాలియర్ సమీపంలో ఉన్న పింప్రి అనే గ్రామానికి చేరుకున్నారు. దాంతో వారిని గుర్తించిన బ్రిటిష్ సైనికులు పట్టుకున్నారు.
స్థానికంగా అధికారి ప్లింక్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అంతకుముందు లక్ష్మీబాయి సంస్థానంలో పని చేసేవారు. ఆయన పదేళ్ల పిల్లవాడు మిమ్మల్ని ఏం చేస్తాడు… అడవిలో జంతువులా బ్రతకాల్సి వస్తోంది క్షమాభిక్ష పెట్టండి అంటూ వేడుకున్నాడు. దానికి ఆయన మూడు నెలలు జైల్లో పెట్టి ఆ తర్వాత ఏడాదికి పది వేలు ఫించన్ ప్రకటించి క్షమాభిక్ష ప్రసాదించారు. కానీ ప్రభుత్వ ఖజానాలోని ఏడు లక్షల రూపాయలను దామోదర రావుకు ఇవ్వలేదు. ఇక 1906లో ఇండోర్ లోనే దామోదరరావు అత్యంత దయనీయ స్థితిలో మరణించారు.
Also Read: 41 రోజులు రిసార్ట్ లో ఉండి 3.2 లక్షల బిల్లు కట్టకుండా జంప్!