Home » టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే… ఏం అవుతుంది అంటే..?

టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే… ఏం అవుతుంది అంటే..?

by Sravya
Ad

చాలామంది టాయిలెట్లు లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ టాయిలెట్లు లో ఎక్కువ సమయాన్ని గడపడం వలన పలు నష్టాలు ఉంటాయి. టాయిలెట్ లో పది నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం వలన కొన్ని నష్టాలు అయితే తప్పవు. టాయిలెట్లో మరి ఎక్కువసేపు ఉంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది టాయిలెట్లలో 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటూ ఉంటారు. అయితే అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడడం, రక్తస్రావం జరగడం వంటివి ఉంటాయి.

Advertisement

Advertisement

రక్తనాళాలు పగిలి రక్తం వస్తుంది. మలవిసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి కారణంగా పైల్స్ వచ్చే సమస్య కూడా ఉంది మలవిసర్జన రాకుండా టాయిలెట్ కి వెళ్లి బలవంతంగా మలవిసర్జన చేయడానికి చూడడం వలన ఇలాంటి నష్టాలు కలుగుతాయి. అత్యవసరంగా అనిపించినప్పుడు మాత్రమే టాయిలెట్ కి వెళ్ళండి. ఎక్కువసేపు కూర్చోకండి. పని అయిపోయిన వెంటనే వచ్చేయండి. రాకపోయినా ఒత్తిడి చేయకూడదు. ఒత్తిడి చేయడం వలన అనేక రకాల సమస్యలు కలుగుతాయి. చాలామంది స్మార్ట్ ఫోన్ ని టాయిలెట్లోకి తీసుకు వెళ్తూ ఉంటారు. దాని వలన నష్టాలు వస్తూ ఉంటాయి. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగడం, ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలి.

Also read:

Visitors Are Also Reading