కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే సోనియా గాంధీ రిటైర్ మెంట్ ప్రకటిస్తుందని కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రలో తన ఇన్నింగ్స్ పూర్తి కానుండటం సంతోషంగా ఉన్నదంటూ పేర్కొన్నారు. ఛతీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీలో సోనియాగాంధీ ప్రసంగించారు. “ భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండడటం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. దేశాన్ని ఓ మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది” అంటూ సోనియా గాంధీ తెలిపారు. ఈ యాత్ర నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుంది” అంటూ పేర్కొన్నారు సోనియా గాంధీ.
Advertisement
డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించినటువంటి విజయాలు తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని కాంగ్రెస్ పార్టీని మలుపు తిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. దేశంలోని బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ ఆధీనంలోకి తీసుకొని చిన్నాభిన్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొద్ది మంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతుందని చెప్పారు సోనియా.
Advertisement
Also Read : పెళ్లికి ముందే ఆస్తి పంపకాలు…అసలు నిజాలు బయటపెట్టిన తారకరత్న సన్నిహితుడు..!
"It is a crucial time for the country as well as for Congress where the BJP/RSS has captured the institutions, ruined the economy, ruthlessly suppressed the voices of resistance & fueled the fire of hatred amongst the people."
-Smt Sonia Gandhi Ji#CongressVoiceOfIndia pic.twitter.com/Wt9yheCfY8
— Indian Youth Congress (@IYC) February 25, 2023
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన తరువాత మొదటిసారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలున్నాయి. తొలిరోజు జరిగిన ప్లీనరీలో పార్టీ టాప్ కౌన్సిల్ సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించాలని కమిటీ తీర్మానించింది. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. మళ్లీ పార్లమెంట్ కి పోటీ చేస్తారా లేదా అనేది లోక్ సభ ఎన్నికల్లో తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాకు సీటును వదులుకుంటారా అనే అనే చర్చ జరుగుతున్న సమయంలోనే.. సోనియా రిటైర్ మెంట్ విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : చిత్రం సినిమా నుండి కూడా ఉదయ్ కిరణ్ ను తప్పించాలని చూశారా..? ఎవ్వరికీ తెలియని స్టోరీ ఇదే..!