Home » సినీ హీరో సుమన్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..? 

సినీ హీరో సుమన్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..? 

by Anji
Ad

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోను పలువురు ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ తరువాత సినిమా ఫ్లాప్ అయితే పాతాళానికి పడేస్తారు. ఎత్తు పల్లాలు ఎవరి జీవితంలోనైనా జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సినీ హీరో సుమన్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. చాలా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరుపురాని పాత్రలను పోషించారు. 

Advertisement

ముఖ్యంగా టాలీవుడ్ లో 1980, 90 దశకంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. చిరంజీవితో సమానంగా ఆయనకు క్రేజ్ ఉండేది. స్వతహాగా అందగాడు, కరాటే ఫైటర్ కావడంతో ఆయనంటే.. అభిమానులు పడి చచ్చేవారు. ఆయన కెరీర్ ఒక్క ఘటనతో పతనమైనా.. తిరిగి మరింత బలంగా ఆయన పుంజుకుంటారు. తాజాగా ఆయనపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి-సుమన్ కి ఒకరు అంటే ఒకరు పడదని.. ఒకరకంగా సుమన్ కెరీర్ పతనానికి చిరంజీవి కారణమనే వదంతులు చానాళ్లుగా ఉన్నాయి. 

Advertisement

వాటన్నింటినీ ఇద్దరూ హీరోలు కొట్టి పడేసారు. తాజాగా చిరంజీవి ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసారు. అందులో సుమన్ 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని కొనియాడారు. విలక్షణమైన శైలితో, 10 భాషల్లో 500కి పైగా సినిమాల్లో నటించడమంటే సాధారణ విషయం కాదన్నారు. సినిమాల పట్ల ఆయన హార్డ్ వర్క్, కమిట్ మెంట్ ఏంటో ఆయన సినిమాలో చెబుతాయని అన్నారు. వెండితెరపై మరిన్నీ సినిమాలు చేయాలని.. దేవుడి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. సుమన్ మంచి స్నేహితుడు అని.. అతనితో ఎలాంటి విభేదాలు లేవని చిరంజీవి చెప్పారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్  చెక్ పెట్టినట్టు అయింది.  

Also Read :  తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా?

Visitors Are Also Reading