సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏది మాట్లాడిన అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Advertisement
యాంకర్ బిల్ గేట్స్ కష్టపడి పని చేశారా..? ఇష్టపడి పని చేశారా అని అడిగిన ప్రశ్నకు వర్మకు 100 శాతం ఇష్టపడే పని చేశారని.. కానీ వాళ్ల కొడుకులో, వాళ్ల వారసురాలో మాత్రం ఉండకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా కష్టపడి పని చేస్తారని వర్మ చెప్పుకొచ్చారు. చిరంజీవి పాలిటిక్స్ గురించి మాత్రం నాకు తెలియదు. మోకాలు ప్రాక్షర్ అయినా చిరంజీవి గారు ఎంతో కష్టపడి డ్యాన్స్ చేస్తారు. కానీ నేను అది కష్టం అనను.. ఎందుకంటే ఇష్టపడి పని చేస్తారు.
కష్టపడడానికి ఇష్టపడడానికి ఏమైనా సంబంధం ఉందంటారా అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు వర్మ ఈ విధంగా సమాధానం చెప్పారు. సినిమా స్టార్ట్స్ చేసి ఆరు నెలలు చాలా ఆనందం అనిపిస్తుంది. సినిమా విడుదలై ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు ఫ్లాప్ అయిందని 5 నిమిషాలు ఆలోచించి నెక్ట్స్ సినిమాలోకి వెళ్లిపోతాను. ఆరు నెలలు పడిన కృషి వృధా అయిందని నేను అనను. ఎందుకంటే..? ఆరు నెలలు నేను కష్టపడలేదని.. ఎంజాయ్ చేశాను.
Advertisement
మీరు అనుకున్నది అవ్వనప్పుడు అసలు ఎందుకు అవ్వడం లేదని దాని గురించి ఆలోచించాలి. మరల దాని వైఫల్యాలు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తరువాత డెసిషన్ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుందని చెప్పాడు. చాలా మంది సొంతంగా ఎవరూ ఆలోచించరు. వేరే వారి ఆలోచనను ఫాలో అవుతుంటారు. ఎవరి ఆలోచనలు ఫాలో అవుతారో వారికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫాలోవర్స్‌కు అసలు ఆలోచించే కెపాసిటీ ఉండదు. అందుకే అతను చెప్పాడు అది కరెక్టే అయి ఉంటుందని అనుకుంటారు. సక్సెస్ పీపుల్ కష్టపడరు. కష్టపడే వారు సక్సెస్ పుల్ వారి వద్ద పని చేస్తారు అని వర్మ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.
Also Read :
తెలుగు హీరోయిన్ అంజలి సినిమాల ద్వారా ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా..?