కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో కుదేలై పునర్ నిర్మాణం పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒకటి రెండు చోట్ల దాదాపు కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుంది. 2024 ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించే భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ అధికారికంగా ప్రారంభించనున్న మొట్టమొదటి జాతీయ స్థాయి పాదయాత్ర కావడం విశేషం.
Advertisement
ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దాదాపు 150 రోజుల్లో 3,500 కిలోమీటర్ల దూరం భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. భారత మాజీ ప్రధాని మరణించిన తమిళనాడులోని తన తండ్రి రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇక తెలంగాణ నుంచి పలువురు నేతలు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
Advertisement
రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక త్వరలోనే జరుగనుంది. కాంగ్రెస్ తరుపున పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే రాహుల్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోడో యాత్రలో పలు అంశాల గురించి చర్చించుకున్నారు.
Also Read : కోమటిరెడ్డి దీక్ష వాయిదా..ఎందుకంటే..?
ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది..? అందరూ కలిసి మెలిసి ప్రచారం చేస్తే కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. కలిసి ప్రచారం చేయాలని రాహుల్ సూచించినట్టు సమాచారం. పాదయాత్ర చేస్తే అధికారం రావడం ఖాయం అని ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వారే. అదేవిధంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. రాహుల్ జోడో యాత్రతో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందా లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో తన సొంత తమ్ముడు రాజ్‌గోపాల్‌రెడ్డికే కోమటిరెడ్డి మద్దతు ఇస్తాడా..? లేక స్రవంతికి మద్దతు ఇస్తాడా అని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం విశేషం.
Also Read : టిక్ టాక్ లో పరిచయమైన యువతితో భర్తకు రెండో పెళ్లి జరిపించిన భార్య..!