బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ ఇటీవల కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూసిన విషయం విధితమే. గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రసిక్ దేవ్ జులై 30న తుదిశ్వాస విడిచారు. ప్రధానంగా ఆయన గుజరాతి, హిందీ సిరియల్స్, సినిమాల్లో నటించారు. 1980లో ప్రసారమైన మహాభారతం సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
2006లో నాచ్ బలియే 2లో రాసిక్, కేత్కి పాల్గొన్నారు. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రసిక్ ఇటీవలే డయాలసిస్ చేయించుకున్నారు. ఈ తరుణంలోనే దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రసిక్ డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే ఆరోగ్యం క్షీణించడంతో తన నివాసంలోనే మృతి చెందారు. ఆయనకు భార్య కేత్కి, కూతురు రిద్ధిదేవ్, ఒక కుమారుడు కలరు. అయితే భర్త మరణించిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్ షూటింగ్‌లో పాల్గొంది.
Advertisement
ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్ భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ముందుగానే డేట్స్ ఇచ్చిన కారణంగా తన వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని ఇలా చేసినట్టు వెల్లడించింది. 1983లో రసిద్ దేవ్-కేత్కి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు కలరు. బాలిక వధు, క్యోంకి సాస్ బీ కబీ బహుతీ సహ పలు హిందీ, గుజరాతి సినిమాల్లో కేత్కిదేవ్ గుర్తింపు సంపాదించుకుంది. భర్త చనిపోయిన రెండు రోజులకే ఈమె సినిమా షూటింగ్‌లో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోవడం విశేషం.
Also Read :
నిఖిల్ సినిమాకు బాలీవుడ్ లో ఫ్రీ ప్రమోషన్..!
“బింబిసార” ఫస్ట్ కలెక్షన్ల మోత….కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటి సారి….!