Home » నిఖిల్ సినిమాకు బాలీవుడ్ లో ఫ్రీ ప్రమోషన్..!

నిఖిల్ సినిమాకు బాలీవుడ్ లో ఫ్రీ ప్రమోషన్..!

by Azhar

నిఖిల్ హీరోగా 2014 లో వచ్చిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ప్రజల ముందుకు వస్తున్నాడు నిఖిల్. చందు మొండేటి దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనేది కేవలం తెలుగులోనే కాకుండా,.. హిందీ, తమిళ్, మలయాళం భాషలో కూడా విడుదల అవుతుంది. అంటే ఓ పాన్ ఇండియా లెవల్ లో వస్తుంది.

అయితే ఈ సినిమా అనౌన్స్ తర్వాత వచ్చిన కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడి సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఇక కరోనా తర్వాత ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసినా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఆగస్టు 12న విడుదల అన్న ఈ సినిమా ఒక్క రోజు ఆలస్యంగా వస్తుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ బిజీగా ఉన్నాడు.

కానీ బాలీవుడ్ లో ఈ నిఖిల్ సినిమాకు ఫ్రీ ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందకంటే అక్కడ ఈ నెలలో విడుదల అయ్యే లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలపై ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నాడు. బోయికాట్ బాలీవుడ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో కార్తికేయ 2 కృష్ణుడి ద్వారకా నేపధ్యంలో వస్తుండటంతో.. ఆ సినిమాలు వదిలేసి ఈ కార్తికేయ 2 సినిమా చూడండి అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే నిఖిల్ సినిమాకు ఎక్కువ ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

తన సక్సెస్ పై దినేష్ కామెంట్స్..!

బంగారు పోరులోకి భారత్..!

Visitors Are Also Reading