Home » నాగార్జున పక్కకు పెట్టేసిన బిగ్ బాస్.. సీజన్ 7 కి హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ..!

నాగార్జున పక్కకు పెట్టేసిన బిగ్ బాస్.. సీజన్ 7 కి హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు స్టార్ హీరోగా ఎదిగిన బాలయ్య ఓటీటీలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేస్తూ  మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ సెలబ్రిటీ టాక్ షోని ఓటీటీ స్థాయిని, ఫాలోయింగ్ ని ఒక్కసారిగా పెంచేశాడు. అంతేకాదు.. తొలి సీజన్ అయినప్పటికీ అన్ స్టాపబుల్ షో ని దేశంలోనే ఉత్తమ షోగా నిలిపాడు. అంతటి జోష్ కలిగిన బాలయ్య ఈ ఏడాది కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2ని సక్సెస్ గా నడిపిస్తున్నాడు. ఫస్ట్ సీజన్ కి మించి సెకండ్ సీజన్ మంచి సక్సెస్ గా దూసుకెళ్లుతోంది. 

Advertisement

సాధారణంగా సినిమాల్లో పవర్ పుల్ డైలాగ్ లతో సినిమాని హిట్ చేయడం బాలయ్యకు కొత్త ఏమీ కాదు.. కానీ హోస్ట్ గా షోలు చేయడం కొత్త అనే చెప్పాలి. తనదైన స్టైల్ లో షోలు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ఇక బాలయ్య పాపులర్ షో అయినటువంటి బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేస్తే షో మామూలుగా ఉండదనుకుంటున్నారు. ఇటీవలే బిగ్ బాస్ 6 సీజన్ లను పూర్తి చేసుకుంది. దాదాపు బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 టీఆర్పీ రేటింగ్స్ బాగా డ్రాప్ అవ్వడంతో బిగ్ బాస్ టీమ్ బాలయ్యను రంగంలోకి దించాలనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

Advertisement

Also Read :   క్రికెట్ గ్రౌండ్ లో సిక్సర్ల తుఫాను సృష్టించిన తన్మయ్ సింగ్..!

మరోవైపు ఈ సారి బిగ్ బాస్ సీజన్ రేటింగ్స్ తగ్గిపోవడంతో బిగ్ బాస్ టీమ్ బాలయ్యని దించాలని ఆలోచిస్తుందట. ఇందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్టు సమాచారం. అంతేకాదు.. ఈ సారి ఫైనల్స్ లో నాగార్జున మళ్లీ కలుద్దాం అని అనకపోవడం గమనార్హం. దీంతో బాలయ్య బిగ్ బాస్ సీజన్ 7కి వస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. మొత్తానికి బాలయ్య మరోమారు హోస్ట్ గా మారిపోతున్నాడని తెలుస్తోంది. 

Also Read :  ఈ విషయాలు తెలిస్తే ఆవాల ఆకులను అస్సలు వదిలిపెట్టరు..!

Visitors Are Also Reading